లోన్ మొత్తం కట్టేసినా ఇంకా 'యాక్టివ్' అనే చూపిస్తోందా? ఇలా సరిచేసుకోండి!

మనం తీసుకున్న లోన్‌కు సంబంధించిన చివరి ఈఎంఐ కూడా చెల్లించి, బ్యాంకు నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత అంతా అయిపోయిందని రిలాక్స్ అవుతాం. కానీ, భవిష్యత్తులో మరో రుణం కోసం అప్లై చేసుకునే ముందు క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తే షాక్ తగులుతుంది. ఎప్పుడో తీర్చేసిన పాత లోన్ అకౌంట్ ఇప్పటికీ 'యాక్టివ్' అని లేదా ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించవచ్చు. ఇది కేవలం రిపోర్టింగ్ ఆలస్యం కావచ్చని చాలామంది దీన్ని తేలికగా తీసుకుంటారు. కానీ, ఇలాంటి చిన్న పొరపాట్లు మీ కొత్త లోన్ అప్లికేషన్‌ను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది. అప్పుల భారం ఎక్కువగా ఉన్నట్లు చూపించడం వల్ల బ్యాంకులు కొత్త రుణాలను మంజూరు చేయడానికి నిరాకరిస్తాయి.

ముందుగా క్లోజర్ డాక్యుమెంట్లు సరిచూసుకోండి

లోన్ పూర్తి చేసిన తర్వాత బ్యాంకు నుంచి వచ్చే 'నో-డ్యూస్ సర్టిఫికేట్' (No-Dues Certificate), లోన్ క్లోజర్ లెటర్ లేదా జీరో బ్యాలెన్స్ స్టేట్‌మెంట్‌ను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అలాగే చివరిసారిగా డబ్బులు చెల్లించిన రసీదు, బ్యాంక్ స్టేట్‌మెంట్ ఎంట్రీని దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ మీరు లోన్‌ను ఫుల్ అమౌంట్ కాకుండా వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS) ద్వారా ముగించి ఉంటే, రిపోర్ట్‌లో అది 'క్లోజ్డ్' అని కాకుండా 'సెటిల్డ్' అని పడుతుంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి, బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటో ముందే స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. ఇక వెహికల్ లోన్ లాంటి సెక్యూర్డ్ లోన్‌లైతే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నుంచి హైపోథెకేషన్ తొలగించే ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.

Loan Repaid but Still Showing Active on Credit Report Here Is How You Can Easily Correct It

అకౌంట్ స్టేటస్ అప్‌డేట్ చేయించండి

మీ లోన్ అకౌంట్ నంబర్, క్లోజ్ చేసిన తేదీ, ఇతర ఆధారాలతో కూడిన పత్రాలను తీసుకుని బ్యాంకు అధికారిక కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించాలి. అకౌంట్ క్లోజ్ అయినట్లు రాతపూర్వకంగా ధృవీకరణ పత్రం తీసుకోవడంతో పాటు, ఆ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపాలని కోరాలి. సాధారణంగా సిబిల్ (CIBIL) వంటి క్రెడిట్ బ్యూరోలు బ్యాంకులు అందించే సమాచారం ఆధారంగానే రిపోర్ట్ తయారు చేస్తాయి. కాబట్టి బ్యాంకు రికార్డుల్లో తప్పు ఉంటే బ్యూరోలు దాన్ని మార్చలేవు. మీరు ఫిర్యాదు చేసినప్పుడు దాని రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి. ఎవరైనా కేవలం మౌఖిక హామీ ఇస్తే సరిపోదు, ఎప్పుడు అప్‌డేట్ చేస్తారో రాతపూర్వకంగా తీసుకోవడం ఉత్తమం.

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!
SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!

క్రెడిట్ బ్యూరో వద్ద వివాదం లేవనెత్తడం ఎలా?

అన్ని ప్రయత్నాలు చేసినా క్రెడిట్ రిపోర్ట్‌లో తప్పు అలాగే కనిపిస్తే, నేరుగా క్రెడిట్ బ్యూరో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో 'డిస్బ్యూట్' రైజ్ చేయవచ్చు. అక్కడ తప్పుగా ఉన్న లోన్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసి, అందుకు సంబంధించిన నో-డ్యూస్ సర్టిఫికేట్‌ను అటాచ్ చేయాలి. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 30 రోజుల వరకు సమయం పట్టవచ్చు. బ్యూరో వారు ఆ విషయాన్ని నేరుగా సంబంధిత బ్యాంకును అడిగి ధృవీకరించుకుంటారు. కస్టమర్ అడిగాడని ఎంట్రీలను వారు స్వయంగా తొలగించలేరు. ఒకవేళ బ్యాంక్ కరెక్షన్ చేయడానికి నిరాకరిస్తే, దానికి తగిన కారణాలు అడిగి తెలుసుకోవాలి.

Home Loan: వడ్డీ రేట్లు పెంపు, పాతికేళ్ల లోన్‌పై ఏకంగా రూ. 2.45 లక్షల భారం!
Home Loan: వడ్డీ రేట్లు పెంపు, పాతికేళ్ల లోన్‌పై ఏకంగా రూ. 2.45 లక్షల భారం!

సమస్య పరిష్కారం కాకపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

బ్యాంకు నుంచి స్పందన రాకపోతే, వారి అధికారిక గ్రీవెన్స్ రిడ్రసల్ ప్రాసెస్ ద్వారా నాడల్ ఆఫీసర్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏజెంట్లు చెప్పే మాయ మాటలను నమ్మి డబ్బులు చెల్లించడం, క్రెడిట్ స్కోర్ పెంచుతామని మోసగించే వారికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ అధికారిక మార్గాలను మాత్రమే అనుసరిస్తూ, రాతపూర్వక పత్రాలను దగ్గర ఉంచుకుంటే తప్పులను సులభంగా సరిదిద్దుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+