వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్చరిక: ఈ యూనివర్శిటీల ప్రమాణాలు దిగదుడుపే...

పలు ప్రతిష్ఠాత్మక, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని అటువంటి సంస్థల్లో 11 యూనివర్సిటీలు ఉన్నాయని కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ నిర్ధారించినట్లు తెలుస్తోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు), అలహాబాద్ విశ్వవిద్యాలయాలు దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ప్రసిద్ధి చెందిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు. కానీ ఆ గొప్పతనం, ఆ ప్రమాణాలు ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆయా యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని, వాటి స్థాయి దిగజారిపోతున్నదని తేలింది. ఈ యూనివర్సిటీల పనితీరుపై అధ్యయనం జరిపి తగు చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

పలు ప్రతిష్ఠాత్మక, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని అటువంటి సంస్థల్లో 11 యూనివర్సిటీలు ఉన్నాయని కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ నిర్ధారించినట్లు తెలుస్తోంది.
వాటిలో మొదటి వరుసలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అలహాబాద్ విశ్వవిద్యాలయం, పాండిచ్ఛేరి యూనివర్సిటీ, జమ్ము కేంద్రీయ యూనివర్సిటీల్లోని విద్యా ప్రమాణాల స్థాయిని సాంకేతికంగా, అకడమిక్‌గా యూజీసీ అడిట్ చేయనున్నది.

ప్రమాణాలు పడిపోయిన వర్సిటీల జాబితా ఇది

ఇంకా హేమవతి నందన్ బహుగుణ గార్హ్వాల్ యూనివర్సిటీ, జార్ఖండ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, లక్నోలోని బాబా సాహెబ్ భీంరావు అంబేద్కర్ వర్సిటీ, రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, సాగర్ డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ, త్రిపర యూనివర్సిటీ, మహాత్మాగాంధీ అంతరాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం కూడా ప్రమాణాలు పడిపోతున్న విద్యాసంస్థల జాబితాలో ఉన్నాయి.

AMU, Allahabad university among 'non-performers'

యూజీసీకి వర్సిటీల జాబితా

ప్రమాణాలు దెబ్బ తిన్న ఈ యూనివర్సిటీల జాబితాను యూజీసికి పంపిస్తామని కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధిశాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై యూజీసీ ఆడిటింగ్ నిర్వహిస్తుంది. అయితే దీనికి ఎటువంటి గడువు ఉండబోదు. అడిటింగ్ చేపట్టేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను యూజీసీ ఖరారు చేసిన వెంటనే రంగంలోకి దిగుతుంది. అకడమిక్ ప్రమాణాలపైన, రీసెర్చ్ కార్యకలాపాలపై, పరిశోధనా ఫలితాలపైనా మదింపు జరుగనున్నది.

యూజీసీ కమిటీ ఆధ్వర్యంలో మదింపు

ఈ ఆడిటింగ్ విధానాన్ని పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యుల టీం ఏర్పాటు కానున్నది. యూజీసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రీసెర్చ్ ఇన్ పుట్, ఔట్ పుట్, విద్యార్థుల ఉత్తీర్ణత, వారికి లభిస్తున్న ఉద్యోగావకాశాలు తదితర అంశాలన్నీ పరిశీలిస్తారు. ఈ విషయాలన్నింటిపై ప్రాధమ్యాలు రూపొందించిన తర్వాత కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ అధికారులకు సమాచారం తెలియజేస్తామని యూజీసీ వర్గాలు తెలిపాయి.

AMU, Allahabad university among 'non-performers'

ప్రమాణాలు పెంపొందించాలంటున్న యూజీసీ

యూనివర్సిటీల్లో ప్రమాణాల మెరుగుదలపై తక్షణం ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని యూజీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలే దేశంలో విద్యా ప్రమాణాల స్థాయికి నిదర్శమని చెప్పారు. విద్యా ప్రమాణాల మదింపునకు వివిధ కోర్సుల సమీక్ష, కొత్త కోర్సులు, ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో రీ సెర్చ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఈ జాబితాలోకి మరికొన్ని వర్సిటీలు

యూనివర్సిటీల్లో పెడుతున్న పెట్టుబడులకు అనుగుణంగా విద్యార్థులకు విద్యాబోధన జరుగుతున్నదా? లేదా? అన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. తమ ఆడిటింగ్ పూర్తయిన తర్వాత ప్రమాణాలు పడిపోతున్న యూనివర్సిటీల జాబితాలో మరికొన్ని సంస్థలు చేరే అవకాశం కూడా ఉన్నదని యూజీసీ అధికారులు అంటున్నారు.

English summary
The government suspects that some of the country's most prestigious universities are underperforming and has, hence, asked the University Grants Commission (UGC) to audit them for academic and research quality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X