అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్: 2,500రకాల వంటకాలు; అబ్బురపరిచే మెనూ; ప్రత్యేకతలివే!!

వివాహాలు... ప్రస్తుత కాలంలో వివాహాలు చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా సెలబ్రిటీల వివాహాలు అంటే అందరి దృష్టి ప్రధానంగా వాటి మీద కేంద్రీకృతం అవుతుంది. ప్రీ వెడ్డింగ్ మొదలుపెట్టి, పెళ్లి తంతు ముగిసే దాకా సినిమాటిక్ స్టైల్లో జరుగుతున్న పెళ్లిళ్లు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక మల్టీ మిలియనీర్లు, వ్యాపార దిగ్గజాల ఇళ్లల్లో పెళ్లంటే మరెంత ఘనంగా ఉండాలి? అనేది ఊహించుకుంటేనే మాటల్లో చెప్పలేం అనే భావన కలుగుతుంది.

ఇక అపరకుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట జరిగే పెళ్లివేడుక అంటే దేశం మొత్తానికి స్పెషల్ ఆసక్తి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ జూలైలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ జనవరి 19, 2023న ముంబైలో గోల్ ధన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Anant Ambani Radhika Merchant Pre Wedding.. Dazzling menu with 2,500 dishes for guests!!

ఈ క్రమంలో వీరి ప్రీ వెడ్డింగ్ ను నిర్వహించనున్నారు ముఖేష్ అంబానీ దంపతులు. ఈ ప్రీ వెడ్డింగ్ కి సంబంధించి ప్రస్తుతం రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తుంది. మార్చి 1వ తేదీనుంచి మూడవతేదీ వరకు గుజరాత్లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు ప్రపంచంలో నలుమూలల నుంచి వెయ్యిమంది వరకు ప్రముఖులు హాజరు అవుతారని తెలుస్తుంది.

ఈ వేడుకలకు వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా వీళ్ళు పెద్ద ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 2500 రకాల వంటకాలను అతిథులకు వడ్డించునున్నట్టు ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఒక్కసారి పెట్టిన వంటకాన్ని మరోసారి పెట్టకుండా మర్చిపోలేని విధంగా విందు భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

ప్రత్యేకమైన మెనూ కూడా సిద్ధం చేసి, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి 21 మంది పాక శాస్త్రంలో ప్రావీణ్యులు అయిన చెఫ్ లను పిలిపించినట్లు సమాచారం. ఈ వేడుకలకు వచ్చే అతిధులకు బ్రేక్ ఫాస్ట్ లో 75 రకాలు, లంచ్ లో 225 రకాలు, ఇక డిన్నర్ లో 275 రకాలు వంటకాలను వడ్డించనున్నారట.

అతిధులకు భారతీయ వంటకాలు మాత్రమే కాదు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా కొన్ని సాంప్రదాయ వంటలు కూడా రుచి చూపించనున్నారని సమాచారం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా 85 రకాల వంటకాలను, వచ్చిన అతిథులు ఏది కోరితే అది పంపించేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ కు వచ్చే వారంతా ప్రీ వెడ్డింగ్ భోజనంబు పసందైన వంటకంబు అంటూ లొట్టలేసుకుంటూ తినాలని అంబానీ కపుల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+