ఘనంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థం: ఎక్కడంటే?
ముంబై: భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనం్ అంబానీకి.. మర్చంట్ వారసురాలైన రాధికా మర్చంట్‌కు గురువారం నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

శ్రీనాథ్ జీ ఆలయంలో అనంత్-రాధికాల నిశ్చితార్థం
రాజస్థాన్ రాష్ట్రంలోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్ జీ ఆలయంలో అనంత్-రాధికాల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు. కాగా, రాధికకు అనంత్ కు కొద్ది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వీరిద్దరూ వారి వారి కుటుంబాలకు చెందిన వ్యాపారాల్లో చురుగ్గా రాణిస్తున్నారు.

విదేశాల్లోనే అనంత్, రాధికల ఉన్నత విద్య
అనంత్ అంబానీ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. ఆ తర్వాత నుంచి రిలయన్స్‌లోని జియో, రిటైల్ వెంచర్స్ బోర్డుల్లో సభ్యుడిగా, వివిధ హోదాల్లో కొనసాగారు. ప్రస్తుతం ఈ సంస్థలోని ఎనర్జీ బిజినెస్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇక రాధిక విషయానికొస్తే.. ఆమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి రాధిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్‌కోర్ హెల్త్ కేర్ బోర్డు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు శైలా, వీరెన్ మర్చంట్ వ్యాపార వ్యవహారాల్లో రాధిక కీలకంగా వ్యవహరిస్తున్నారు.

నీతా అంబానీలానే రాధిక కూడా శాస్త్రీయ నృత్యకారిణి
అంతేగాక, రాధిక ఆమె అత్త నీతా అంబానీల క్లాసికల్ డ్యాన్సర్ కూడా కావడం విశేషం. రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్ననాటి నుంచి ఇష్టం. దీంతో ప్రముఖ డ్యాన్సర్ భావనా థాకర్ వద్ద ఆమె భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న రాధికకు.. కాబోయే అత్తామామలు ముకేశ్-నీతా అంబానీలు జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఘనంగా అరంగేట్రం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గురువారం అనంత్-రాధికల నిశ్చితార్థం(రోకా) వేడుక ఘనంగా జరగ్గా.. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications