విషాదం: 41ఏళ్లకే బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ అనంత్ బజాజ్ మృతి

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ చైర్మన్‌ శేఖర్‌ బజాజ్‌ కొడుకు, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ అనంత్‌ బజాజ్‌(41) కన్నుమూశారు. చిన్న వయసులోనే ఆయన కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై, శుక్రవారం సాయంత్రం 6గంటలకు ముంబైలో తన తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబం ప్రకటించింది.

అనంత్‌ బజాజ్‌ అంత్యక్రియలు శనివారం ఉదయం 10.30కు కల్బదేవిలోని చందన్వాడి శ్మశానంలో జరుగనున్నట్టు పేర్కొంది. అనంత్‌ బజాజ్‌, రెండు నెలల క్రితమే బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవిని అలంకరించడానికి కంటే ముందు, ఆర్గనైజేషన్‌లో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను నిర్వర్తించేవారు.

Anant Bajaj of Bajaj Electricals dies at 41

1999లో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌గా అనంత్‌ తన కెరీర్‌ను ప్రారంభించారు. హై-టెక్‌ అప్లియెన్సస్‌ అభివృద్ధి చేయడానికి బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌లోనే రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

అంతేగాక, ముంబైలో డిజిటల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అనంత్‌ ఇండియన్‌ మెర్చంట్స్‌ ఛాంబర్‌లో యంగ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌ వింగ్‌కు సభ్యుడు. గ్రీన్‌పీస్‌ ఆర్గనైజేషన్‌లో కూడా ఆయన సభ్యుడే. పలు ఇతర కంపెనీల్లో కూడా అనంత్‌ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+