Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదొక్కటే తక్కువ, అసభ్యంగా తాకుతున్నారు: ఎయిర్‌హోస్టెస్‌ల నిరసన

చెన్నై:స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న నో ప్రిల్స్ కారియర్‌కు వ్యతిరేకంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్‌హోస్టెస్‌లు నిరసన వ్యక్తం చేశారు. ఈ పాలసీలో భాగంగా ఎయిర్‌లైన్స్ అధికారులు , భద్రతా సిబ్బంది తమను అవమానకరరీతిలో తనిఖీలు చేస్తున్నారని ఎయిర్‌హోస్టెస్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విమానాలు డీబోర్డింగ్ అయ్యాక భద్రతా సిబ్బంది తమ హ్యండ్‌బ్యాగ్‌లను తనిఖీ చేస్తున్నారని వారు చెప్పారు. అంతేకాదు తమ హ్యండ్ బ్యాగ్‌ల నుండి సానిటరీ ప్యాడ్స్‌ను కూడ తొలగించారని ఎయిర్‌హోస్టెస్‌లు ఆవేదన చెందుతున్నారు.

And We Talk Of Rape...: SpiceJet Crew Allegedly Strip-Searched By Airline

తనిఖీల పేరుతో అసభ్యంగా తమ శరీరాన్ని భద్రతా అధికారులు తాకుతున్నారని కూడ వారు చెబుతున్నారు. తమ పట్ల భద్రతా సిబ్బంది వ్యవహరిస్తున్నతీరు అత్యాచారం కంటే ఎక్కువగా ఉందని ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణీకులకు ఆహరపదార్ధాలు, ఇతర పదార్ధాలను ఇవ్వడానికి ప్రయాణీకుల నుండి డబ్బులను తీసుకొంటున్నారని స్పైస్‌జెట్ యాజమాన్యం విమానాలు డీబోర్డింగ్ అయ్యాక ఎయిర్‌హోస్టెస్‌లను తనిఖీ చేస్తోంది. తనిఖీలు నిర్వహించే సమయంలో కనీసం బాత్‌రూమ్‌కు కూడ వెళ్ళకూడదని నియమం పెట్టడంతో వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎయిర్‌హోస్టెస్‌లతో స్పైస్‌జెట్ యాజమాన్యం సమావేశం నిర్వహించింది. వారి సమస్యల గురించి చర్చించింది. దీంతో రెండు ఇంటర్నేషనల్ విమానాలు ఆలస్యమయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+