రద్దయిన రైళ్ల వివరాలు ఇవే: పెరిగిన మృతుల సంఖ్య
చెన్నై: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్యాసింజర్.. కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. సిగ్నల్ అందక మెయిన్ లైన్‌పై ఆగివున్న ప్యాసింజర్‌ను.. అదే ట్రాక్‌పై వచ్చిన విశాఖపట్నం-రాయగఢ మధ్య నడిచే పలాస ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీకొట్టింది.
ఈ ఘటనతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. 11 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని విశాఖ ఎన్ఆర్‌ఐ ఆసుపత్రి, మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులందరూ ఏపీకి చెందినవారే.

సంఘటన స్థలంలో ఆరుమంది మరణించారు. 32 మంది గాయపడ్డారు. అనంతరం మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. తాజాగా 11 మంది మృతి చెందినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బిశ్వజిత్ సాహు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తోన్నామని వివరించారు.
ఈ ప్రమాదం అనంతరం ఈ మార్గంలో తిరిగే 12 రైళ్లు రద్దయ్యాయి. మరి కొన్నింటిని దారి మళ్లించారు. నంబర్ 08527 రాయ్‌పూర్- విశాఖపట్నం, 08528 విశాఖపట్నం-రాయ్‌పూర్, 08531 పలాస-విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్, 18518 విశాఖపట్నం-కోర్బా ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి.
08531 పలాస-విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్, 22810 విశాఖపట్నం-పారాదీప్ ఎక్స్‌ప్రెస్, 22809 పారాదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, 18517 కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, 08503 రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్, 07469 విజయనగరం-విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్ రద్దయ్యాయి.
08522 విశాఖపట్నం-గుణుపూర్ స్పెషల్, 08521 గుణుపూర్-విశాఖపట్నం స్పెషల్‌ను రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్గంలో తిరిగే తిరుపతి- భువనేశ్వర్, పూరీ- చెన్నై, యశ్వంత్‌పూర్- పూరీ, బెంగళూరు- అగర్తలా సహా పలు రైళ్లను దారి మళ్లించినట్లు బిశ్వజిత్ సాహు చెప్పారు.












Click it and Unblock the Notifications