శివసేన నాయకుడి పై కాల్పులు: అలర్ట్
ముంబై: శివసేన నాయకుడిపై కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. శివసేన నాయకుడు అనీల్ చౌహాన్ కు బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు.
ముంబై నగర సీనియర్ పోలీసు అధికారి అవినాష్ అంబురే కథనం మేరకు వివరాలు ఈ విదంగా ఉన్నాయి. బుధవారం ఉదయం ఉత్తర ముంబై లోని కశ్మీరియా ప్రాంతంలో అనీల్ చౌహాన్ ఉన్నారు. ఆ సందర్బంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్లారు.
తరువాత ఇద్దరూ కలిసి తుపాకులతో అనీల్ చౌహాన్ మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనారు. తీవ్రగాయాలైన అనీల్ చౌహాన్ ను భక్తి వేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారి అవినాష్ అంబురే అన్నారు.

అయితే అనీల్ చౌహాన్ మీద కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తుల గురించి తెలియడం లేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అవినాష్ అంబురే చెప్పారు. అనీల్ చౌహాన్ పై హత్యాయత్నం జరగడంతో శివసేన నాయకులు ఆందోళనకు దిగారు.
శివసేన నాయకులు, కార్యకర్తలు పలు చోట్ల ధర్నాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. నిందితులను త్వరగా అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై నగరంలోని సున్నితమైన ప్రాంతాలలో పోలీసులు గట్టి బందోబస్తు ఎర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications