తల్లి పిలుపు: పోలీసులకు లొంగిపోయిన ఉగ్రవాది
శ్రీనగర్: తల్లి వేదనను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఉగ్రవాదాన్ని వీడి తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. ఓ తల్లి తన కుమారుడిని ఉగ్రవాదం వదిలి ఇంటికి రావాలంటూ సామాజిక మాధ్యమాలలో ఓ లేఖ ద్వారా కోరిన సంగతి తెలిసిందే.
తల్లి కోరికను కాదనలేక సదరు యువకుడు వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం మరో యువకుడు కూడా తన తల్లి కోరిక మేరకు ఉగ్రవాదాన్ని వదిలి తిరిగి ఇంటికి చేరకున్నట్లు పోలీస్ సీనియర్ అధికారి తెలిపారు.
'హింసను వదిలి ఇంటికి చేరాలంటూ ఓ తల్లి వేడుకోగా.. ఆమె కుమారుడు కాదనలేకపోయాడు. వెంటనే తిరిగి ఇంటికి చేరుకున్నాడు' అని రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ ట్విటర్ ద్వారా తెలిపారు. కుటుంబమంతా మళ్లీ ఏకం కావడం పట్ల డీజీపీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. యువత తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దని కోరారు.












Click it and Unblock the Notifications