Stan Swamy : స్టాన్ స్వామి కేసులో షాకింగ్-కంప్యూటర్ హ్యాక్-ఆధారాలు చొప్పించి-యూఎస్ రిపోర్ట్

రెండేళ్ల క్రితం మావోయిస్టులతో కలిసి ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారంటూ బీమా కొరెగావ్ కేసులో అరెస్టు చేసిన ఫాదర్ స్టాన్ స్వామి ఆ తర్వాత కస్టడీలోనే చనిపోయారు. ఈ వ్యవహారంపై యూఎస్, యూకే వంటి దేశాలు స్పందించాయి. దీంతో భారత్ ఇరుకునపడాల్సిన పరిస్దితి. ఇప్పుడు ఈ కేసులో యూఎస్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ సంస్ధ కీలక ఆధారాలు బయటపెట్టింది.

మావోయిస్టులతో లింకుల ఆరోపణలతో ఎన్ఐఏ అభియోగాలు మోపి అరెస్టు చేసిన 83 ఏళ్ల స్టాన్ స్వామి ల్యాప్ టాప్ ను హ్యాక్ చేసి అందులో ఇందుకు సంబంధించిన ఆధారాలను అమర్చారని ఫోరెన్సిక్ సంస్ధ ఆర్సెనిక్ కన్సల్టింగ్ గుర్తించింది. స్వామి తరపు న్యాయవాదులు నియమించిన బోస్టన్‌కు చెందిన ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనల్ కన్సల్టింగ్ తన అధ్యయనంలో మావోయిస్టు లేఖలు అని చెప్పిన 44 పత్రాల్ని గుర్తుతెలియని వ్యక్తి సైబర్ దాడి చేసి స్వామి కంప్యూటర్‌లోకి ప్రవేశించి చాలా కాలం పాటు పెట్టాడని వెల్లడించిది. 2014 నుండి ప్రారంభించి 2019లో సైబర్ దాడికి గురయ్యే వరకు ఇలా పలు డాక్యుమెంట్లు ఆయన ల్యాప్ టాప్ లో పెట్టారని గుర్తించారు.ఈ కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ కూడా నివేదించింది.

 another twist in stan swamy case-us report says evidence planted in his laptop

గిరిజనుల మధ్య పనిచేసిన జార్ఖండ్‌కు చెందిన జెస్యూట్ పూజారి స్టాన్ స్వామిని భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కోవిడ్-సంబంధిత సమస్యల కారణంగా ఆయన జైలులో ఉన్న ఏడాదిలోపే చనిపోవడంతో ఈ విమర్శలు మరింత పెరిగాయి. ఫాదర్ స్టాన్ స్వామి మరణ వార్తపై ఐరాసతో పాటు ఈయూ కూడా తీవ్రంగా స్పందించాయి. ఉగ్రవాది అంటూ తప్పుడు ఆరోపణలతో ఆయన్ను జైల్లో ఉంచి చావుకు కారణమయ్యారంటూ వారు ఆరోపించారు. అయితే 2018లో మహారాష్ట్రలోని భీమా-కోరెగావ్ గ్రామంలో దళితులు అగ్రవర్ణ సైన్యాన్ని ఓడించిన చారిత్రాత్మక పోరును గుర్తుచేసుకోవడానికి దళితులు గుమిగూడి అల్లర్లను ప్రేరేపించడానికి మరో 15 మందితో కలిసి కుట్ర పన్నారని ఎన్ఐఏ పేర్కొంది. వారి కంప్యూటర్ల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ప్రధాని మోడీని చంపడానికి మావోయిస్టులతో కలిసి కుట్ర పన్నారని స్వామితో పాటు పలువురిపై అభియోగాలు మోపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+