వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Anti CAA WAR: యూపీలో నిరసనలలో మరణించిన 16 మంది..14 మందికి బుల్లెట్ గాయాలు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపధ్యంలో యూపీలో హింసాకాండ కొనసాగింది . పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మృతుల సంఖ్య 16కి చేరింది. గత ఐదు రోజుల నుంచి యూపీలో జరుగుతూనే ఉన్న ఆందోళనలను అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు కాల్పులు జరిపారు. గత రెండ్రోజులునిరసనలు తీవ్రరూపం దాల్చటంతో పోలీసుల కాల్పుల్లో పలువురు మృతి చెందారు.

యూపీలో 16 కు చేరిన మృతుల సంఖ్య.. 14 మందికి బుల్లెట్ గాయాలు

యూపీలో 16 కు చేరిన మృతుల సంఖ్య.. 14 మందికి బుల్లెట్ గాయాలు

యుపిలో పౌరసత్వం (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో మరణించిన 16 మందిలో 14 మంది " బుల్లెట్ గాయాలకు" గురయ్యారు.ఇక ఈ విషయాన్ని ఎనిమిది జిల్లాలకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు ధృవీకరించారు.మిగతా ఇద్దరిలో, ఫిరోజాబాద్‌లో రషీద్ (35) తలకు గాయాలు కావడంతో మరణించగా, వారణాసిలో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించడంతో మొహమ్మద్ సాగీర్ (8) ఘర్షణలో టెన్షన్ కు గురై మరణించారు.

బుల్లెట్ గాయాలతో మరణించిన వారి వివరాలు ఇవే

బుల్లెట్ గాయాలతో మరణించిన వారి వివరాలు ఇవే

బుల్లెట్ గాయాలతో మరణించిన వారి వివరాలు చూస్తే లక్నోలో మహ్మద్ వకీల్ (32); కాన్పూర్‌లో అఫ్తాబ్ ఆలం (22), మహ్మద్ సైఫ్ (25); బిజ్నోర్‌లో అనాస్ (21), సులేమాన్ (35); సంబల్‌లో బిలాల్ (24), మహ్మద్ షెరోజ్ (23); మీరట్‌లో జహీర్ (33), మొహ్సిన్ (28), ఆసిఫ్ (20), అరీఫ్ (20); ఫిరోజాబాద్‌లో నబీ జహాన్ (24); మరియు, రాంపూర్లో ఫైజ్ ఖాన్ (24) లు మరణించారు . కాన్పూర్‌లో శుక్రవారం జరిగిన నిరసనల సందర్భంగా 28 ఏళ్ల హెచ్‌ఐవి రోగి తుపాకీ గాయాలకు గురైనట్లు పోలీసులు తెలిపారు. 15 మంది బాధితుల మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

బుల్లెట్ గాయాలతో మరణించిన వారి వివరాలు చెప్తున్న పోలీసు అధికారులు

బుల్లెట్ గాయాలతో మరణించిన వారి వివరాలు చెప్తున్న పోలీసు అధికారులు

ఐజి (లా అండ్ ఆర్డర్) ప్రవీణ్ కుమార్ ఈ ఘటనలపై మాట్లాడుతూ ,చాలా ఘటనలలో , నిరసనకారుల కాల్పుల్లో బాధితులు మరణించారని శవపరీక్ష నివేదికలు సూచిస్తున్నాయని చెప్పారు..అయితే వీటిపై జిల్లాల నుండి వివరణాత్మక నివేదికలు కోరినట్లు ఆయన చెప్పారు. ఇక కాన్పూర్లో, నాయి బస్తీలోని మసీదు సమీపంలో జరిగిన హింస సమయంలో" తుపాకీ గాయాల కారణంగా అఫ్తాబ్ మరియు సైఫ్ మరణించినట్లు సర్కిల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ గుప్తా ధృవీకరించారు. "అఫ్తాబ్ పోలీసులు తనపై కాల్పులు జరిపాడని నాకు చెప్పారు అని అఫ్తాబ్ సోదరుడు మొహమ్మద్ రిజ్వాన్ చెప్తున్నారు . సైఫ్ సోదరుడు మొహమ్మద్ జాకీ మాట్లాడుతూ,నా సోదరుడిని పోలీసులు కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు మాకు చెప్పారు అని తెలిపారు. పోలీసులే దారుణంగా హతమార్చారని వారు ఆరోపిస్తున్నారు.

ఎనిమిది జిల్లాలలో మృతుల వివరాలు తెలిపి ధృవీకరిస్తున్న పోలీసులు

ఎనిమిది జిల్లాలలో మృతుల వివరాలు తెలిపి ధృవీకరిస్తున్న పోలీసులు

నహ్తౌర్ ప్రాంతంలో ఘర్షణల సమయంలో తుపాకీ గాయాల కారణంగా అనాస్, సులేమాన్ మరణించారని బిజ్నోర్ ఎస్పీ సంజీవ్ త్యాగి తెలిపారు. నిరసనల సమయంలో బిలాల్, షెహ్రోజ్ మరణించారని, శవపరీక్ష నివేదికలో తుపాకీ గాయాలు ఉన్నట్లు ధృవీకరించినట్లు సంభాల్ అదనపు ఎస్పీ అలోక్ కుమార్ జేస్వాల్ తెలిపారు. హింసాత్మక నిరసనల సందర్భంగా జహీర్, మొహ్సిన్, ఆసిఫ్, ఆరీఫ్ తుపాకీ గాయాలతో మరణించారని మీరట్ అదనపు ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ తెలిపారు. ఫిరోజాబాద్‌లో ఎస్పీ సచింద్ర పటేల్ మాట్లాడుతూ పోస్ట్‌మార్టం నివేదికలో రషీద్ గాయపడ్డారని, ఆటను తీవ్ర గాయాలతో మరణించాడని, నల్‌బంద్ ప్రాంతంలో నిరసనల సమయంలో తుపాకీ గాయాల కారణంగా నబీ జహాన్ మరణించాడని ధృవీకరించారు.

పోలీసు కాల్పులు జరపలేదని నిన్న .. 14 మంది బుల్లెట్ గాయాలతో మృతి అంటూ నేడు ప్రకటన

పోలీసు కాల్పులు జరపలేదని నిన్న .. 14 మంది బుల్లెట్ గాయాలతో మృతి అంటూ నేడు ప్రకటన

రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆంజనేయ కుమార్ సింగ్ శవపరీక్ష నివేదికను ఉద్దేశించి ఫైజ్ ఖాన్ మరణం తుపాకీ గాయం కారణంగా జరిగిందని ధృవీకరించారు. భెలూపూర్ ప్రాంతంలో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బలవంతంగా ప్రయోగించడంతో ఎనిమిదేళ్ల సాగీర్ తొక్కిసలాటలో మరణించాడని వారణాసిలో సర్కిల్ ఆఫీసర్ సుధీర్ జైస్వాల్ తెలిపారు. నిన్నటి వరకు పోలీసులు కాల్పులే జరపలేదు అని చెప్పిన పోలీసులు మృతుల్లో 14 మంది బుల్లెట్ గాయాలతో మరణించారని ధ్రువీకరించటం గమనార్హం .

English summary
Fourteen of the 16 persons who were killed during protests against the Citizenship (Amendment) Act over the last four days in UP succumbed to “firearm injuries”, senior police officers from eight districts confirmed .Of the other two, officers said, Rashid (35) died due to head injuries in Firozabad while Mohammad Sageer (8) succumbed to injuries sustained in a stampede as police tried to disperse protesters in Varanasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X