• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Anti CAA WAR: యూపీలో పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టు అధికారిక ప్రకటన

|

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపధ్యంలో యూపీలో హింసాకాండ కొనసాగింది . పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మృతుల సంఖ్య 16కి చేరింది. గత ఐదు రోజుల నుంచి యూపీలో జరుగుతూనే ఉన్న ఆందోళనలను అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు కాల్పులు జరిపారు. గత రెండ్రోజులునిరసనలు తీవ్రరూపం దాల్చటంతో పోలీసుల కాల్పుల్లో పలువురు మృతి చెందారు. అయితే ఇప్పటివరకు పోలీసుల కాల్పుల్లో పౌరులు మృతి చెందారని ధృవీకరించని పోలీసులు తాజాగా ఒకరు పోలీసుల కాల్పులలో మృతి చెందినట్టు ప్రకటించారు.

పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి .. చెప్పిన బిజ్నోర్ ఎస్పీ

పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి .. చెప్పిన బిజ్నోర్ ఎస్పీ

యుపిలో పౌరసత్వం (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో మరణించిన 16 మందిలో సులేమాన్ ను ఆత్మరక్షణలో భాగంగా కానిస్టేబుల్ మోహిత్ కుమార్ కాల్చి చంపినట్టు ధృవీకరించారు. సులేమాన్ శరీరం నుండి ఒక బుల్లెట్ తియ్యబడింది అని ఇది మోహిత్ కుమార్ యొక్క సర్వీస్ రివాల్వర్ నుండి కాల్చబడిన బుల్లెట్ అని నివేదిక ధృవీకరిస్తుంది. మోహిత్ కుమార్ కూడా బుల్లెట్ గాయంతో బాధపడ్డాడని చెప్పారు . మోహిత్ కుమార్ ఉదర భాగం నుండి తీసిన బుల్లెట్ నాటు తుపాకీ నుండి కాల్చినట్లు గుర్తించామని అని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ త్యాగి అన్నారు.

మోహిత్ కుమార్ అనే కానిస్టేబుల్ కాల్చారని వెల్లడి

మోహిత్ కుమార్ అనే కానిస్టేబుల్ కాల్చారని వెల్లడి

సులేమాన్ తన గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉన్నాడు . అతను నోయిడాలోని తన మామయ్య అన్వర్ ఉస్మానీ వద్ద ఉంటూ యుపిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అతను అధిక జ్వరంతో బాధపడుతున్నప్పటి నుండి నెహ్తౌర్కు వచ్చాడు. మోహిత్ కుమార్ బిజ్నోర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) లో ఉన్నారు . శుక్రవారం, అతన్ని భద్రతా ఏర్పాట్ల కోసం నెహ్తౌర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో డ్యూటీ వెయ్యగా బుల్లెట్ గాయంతో ఆయన ప్రస్తుతం బిజ్నోర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

నిరసనకారుల ఆందోళనలో ఉద్రిక్తత

నిరసనకారుల ఆందోళనలో ఉద్రిక్తత

గత శుక్రవారం జరిగిన హింసాకాండలో 20 మంది పోలీసులతో సహా 26 మంది గాయపడ్డారు. సులేమాన్ తో పాటు మరొక వ్యక్తి అనాస్ (21) మరణించగా, మోహిత్ కుమార్ మరియు నెహతౌర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేష్ సింగ్ సోలంకితో సహా మరో ముగ్గురు పోలీసులు బుల్లెట్ గాయాల పాలయ్యారు. బిజ్నోర్ పోలీసుల ప్రాధమిక నివేదిక ప్రకారం, నిరసన సమయంలో ఈ ముఠా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆశిష్ యొక్క సర్వీస్ పిస్టల్ ను లాక్కున్నారు .

ఆత్మరక్షణ కోసం కాల్చిన కానిస్టేబుల్ మొహిత్ కుమార్ .. మోహిత్ పరిస్థితి విషమం

ఆత్మరక్షణ కోసం కాల్చిన కానిస్టేబుల్ మొహిత్ కుమార్ .. మోహిత్ పరిస్థితి విషమం

ఇది చూసిన కానిస్టేబుల్ మోహిత్ కుమార్ సహా కొంతమంది పోలీసులు వారిని వెంబడించారు. "మోహిత్ సులేమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, తరువాతి వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. మోహిత్ కడుపులో బుల్లెట్ తగిలింది. దీనికి సమాధానంగా, మోహిత్ తన సర్వీస్ పిస్టల్ నుండి కూడా కాల్పులు జరిపాడు మరియు బుల్లెట్ సులేమాన్ కడుపును తాకింది , ఆత్మ రక్షణ కోసమే మోహిత్ కాల్పులు జరిపారని త్యాగి చెప్పారు.

నమాజ్ చేసి వస్తున్న కుమారుడిని తీసుకెళ్ళి చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ

నమాజ్ చేసి వస్తున్న కుమారుడిని తీసుకెళ్ళి చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ

అయితే, సులేమాన్ కుటుంబం మాత్రం పోలీసులు తమ కుమారుడు నమాజ్ చేసుకుని మసీదు నుండి తిరిగి వస్తున్న క్రమంలో మదర్సా దగ్గర సందులోకి తీసుకెళ్లి కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు . కుటుంబం సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు, మృతదేహాన్ని తీసుకు వెళ్ళటానికి కూడా వారిని అనుమతించలేదని తండ్రి ఉస్మానీ పేర్కొన్నారు. పోస్టుమార్టం కోసం పోలీసులు నేరుగా బిజ్నోర్ వద్దకు తీసుకువెళ్లారు.కుటుంబం బిజ్నోర్ చేరుకున్నప్పుడు, వారిని తిరిగి పంపించి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు పిలిచారు అని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు .

English summary
Bijnor police confirmed that Suleiman was shot dead as the Constable Mohit Kumar has shoot at him as part of self-defense . in the deaths of 16 people who were killed during protests against the citizenship (Amendment) Act in UP. Mohit Kumar also suffered a bullet wound. Bijnor police superintendent Sanjeev Tyagi said Mohit Kumar was found to have fired a bullet from the abdomen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more