Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హిందీ భాష అమలుపై దక్షిణాదిన నిరసన సెగలు..నష్ట నివారణ చర్యలు చేపట్టిని కేంద్రం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యావిధానంలో మార్పులు రావాలని పాఠశాలల్లో హిందీతో కలిపి మూడు భాషలు ఉండేలా విధానాలు రూపొందించాలన్న కేంద్రం నిర్ణయంపై కేబినెట్‌లోని తమిళ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. దక్షిణాది రాష్ట్రాల వారు హిందీ నేర్చుకుంటారు కానీ... ఉత్తరాదిన ఉండేవారు తమిళం, మళయాలం నేర్చుకుంటారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సూటిగా ప్రశ్నించారు. ఈ అంశం చిలికి చిలికి పెద్ద గాలివానలా మారుతుండటంతో కేంద్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది.

కొత్తగా అనుకుంటున్న విద్యావిధానాలు ఇప్పుడు అప్పుడే అమలు చేసేది లేదని ప్రజాభిప్రయా సేకరణ తరువాతే అమలు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తమిళంలో ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రాచీన భాష అయిన తమిళంను కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన మరో కేంద్ర మంత్రి జైశంకర్ కూడా ఇదే తరహా ట్వీట్ ఇంగ్లీషు, తమిళంలో చేశారు . కేంద్ర మానవ వనరుల శాఖకు సమర్పించిన జాతీయ విద్యా విధానం ఒక రిపోర్టు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.సాధారణ ప్రజల నుంచి ప్రజాభిప్రాయం సేకరించడం జరుగుతుందని ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వాలను సంప్రదించడం జరుగుతుందని జైశంకర్ ట్వీట్ చేశారు.ఆ తర్వాతే ఏమి చేయాలి ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న దానిపై ముసాయిదా తయారు చేయడం జరుగుతుందని జైశంకర్ వెల్లడించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తుందని ఏ ఒక్క భాషకే పరిమితం కాలేదని ఆయన స్పష్టం చేశారు.

తమిళనాడుకు చెందిన ఇద్దరు మంత్రులు అయిన నిర్మలా సీతారామన్, జైశంకర్‌లు మాత్రమే ట్వీట్ చేయడం వెనక వ్యూహం ఉంది. వీరిద్దరికీ విద్యాశాఖతో ప్రమేయం లేదు. అయినప్పటికీ నష్టనివారణ చర్యల్లో భాగంగా వీరితో ప్రభుత్వం ట్వీట్ చేయించిందనే వార్త ప్రచారంలో ఉంది. తమిళనాడులో చెలరేగిన దుమారం పెద్దది కాకమునుపే తమిళంలో, ఇంగ్లీషులో ట్వీట్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత హెచ్‌ఆర్ మంత్రి కూడా ప్రజామోదం లేకుండా ఎలాంటి ముందడుగు పడదంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడులోని రాజకీయ పార్టీలు కేంద్రం తీసుకొస్తామంటున్న కొత్త విద్యావిధానంపై మండిపడ్డాయి. డీఎంకే, కాంగ్రెస్, ఎండీఎంకే, కమ్యూనిస్టులు, కమల్ హాసన్ పార్టీలు కేంద్రంపై ధ్వజమెత్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో రెండు భాషల ఫార్ములాను అమలు చేస్తున్నామని దాన్నే కొనసాగిస్తామని అధికార అన్నాడీఎంకే స్పష్టం చేసింది.

Anti Hindi Protests: Centre into damage control mode

ఇక బెంగాల్‌లో అయితే బంగ్లా పొక్కొ సివిల్ సొసైటీకి చెందిన వందలాది కార్యకర్తలు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డుపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మూడు భాషలు ఉండాలన్న ముసాయిదాను కాల్చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని ఖండిస్తున్నామని కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+