లైంగిక క్రీడ: నవవధువును హత్య చేసిన స్నేహితురాలు

బెంగళూరు: నవవధువును ఆమె ప్రాణ స్నేహితురాలు దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని మండ్యలో జరిగింది. మార్చి 31వ తేదిన జరిగిన హత్యను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మండ్యలోని హాలహళ్ళి లేఔట్ నివాసి అనుషా (20) అనే యువతిని అరెస్టు చేశామని శుక్రవారం పోలీసులు చెప్పారు.

దివ్యశ్రీ (24) అనే నవవధువు హత్యకు గురైయ్యింది. మార్చి 31వ తేదిన మండ్యలోని వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలోని నిర్జనప్రదేశంలో దివ్యశ్రీ శవమై కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గురైయ్యింది దివ్యశ్రీ అని గుర్తించారు.

దివ్యశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దివ్యశ్రీ మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులకు అనుమానం వచ్చి అనూషను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసింది. దివ్యశ్రీని హత్య చేసింది తానేనని అనుషా అంగీకరించిందని మండ్య పోలీసులు తెలిపారు.

వివరాలు...............!

Anusha murdered his friend Divya Shree(24) in Halahalli Badavane

మండ్యలోని హాలహళ్ళికి చెందిన దివ్యశ్రీ, అనుషా ప్రాణస్నేహితులు. దివ్యశ్రీ మండ్యలోని ప్రయివేటు కాలేజ్ లో బీఇడీ విద్యాభ్యాసం చేస్తున్నది. అనుషా మండ్యలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నది. బెంగళూరులోని నాగరబావికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు సాగర్ అనే యువకుడితో దివ్యశ్రీ వివాహం నిశ్చయం అయ్యింది.

దివ్యశ్రీని సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు ఇచ్చి వివాహం చెయ్యరాదని అనుషా పట్టుబట్టింది. దివ్యశ్రీ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చింది. దివ్యశ్రీ కుటుంబ సభ్యులు ఆమె మాటలు పట్టించుకొలేదు. మార్చి 8వ తేదిన దివ్యశ్రీ, సాగర్ ల వివాహం ఘనంగా జరిగింది. అప్పటి నుండి అనుషా షాక్ కుగురైయ్యింది.

బెంగళూరులోని నాగరబావిలో ఉన్నభర్త ఇంటికి వచ్చిన దివ్యశ్రీ ఉగాది పండగకు మండ్య వెళ్లింది. బీఇడి పూర్తి కాకపోవడంతో పుట్టింటిలోనే ఉంటూ కాలేజ్ కు వెలుతున్నది. షాక్ లో ఉన్న అనుషా దివ్యశ్రీకి ఫోన్ చేసి మొబైల్ షాప్ దగ్గరకు పిలిపించుకునింది. ఇద్దరు కలిసి షాప్ దగ్గర చాలసేపు మాట్లాడుకున్నారు.

తరువాత అనుషా తన స్కూటర్ లో దివ్యశ్రీని పిలుచుకుని వ్యవసాయ శాఖ కార్యాలయం దగ్గరకు పిలుచుకుని వెళ్లింది. ముందుగానే వెంట తీసుకు వెళ్లిన వైర్ తీసుకుని దివ్యశ్రీ గొంతు బిగించి దారుణంగా హత్య చేసిందని పోలీసులు చెప్పారు.

దివ్యశ్రీ, అనుషా కలిసి అనేక ఫోటోలు తీసుకున్నారు. అన్ని ఫోటోలలో అనుషా దివ్యశ్రీని కౌగిలించుకొవడం, ముద్దు పెట్టుకొవడం లాంటి పనులు చేసిందని పోలీసులు అన్నారు. అంతే కాకుండా దివ్యశ్రీ భర్త మొబైల్ కు ఐ హేట్ యు అంటూ మేసేజ్ పంపించిందని పోలీసులు చెప్పారు. లైంగికక్రీడకు సహకరించలేదని దివ్యశ్రీని అనుషా హత్య చేసి ఉంటుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+