జవాన్లను అవమానిస్తే అక్కడే కాల్చి పారేయాలి: యోగేశ్వర్ దత్

సైనికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్లను కాల్చి చంపాలని రెజ్లర్, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అన్నారు. శ్రీనగర్‌లో భద్రతా సిబ్బందిపై యువత దాడి వీడియోలు బయటకొచ్చిన నేపథ్యంలో

న్యూఢిల్లీ: సైనికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్లను కాల్చి చంపాలని రెజ్లర్, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అన్నారు. శ్రీనగర్‌లో భద్రతా సిబ్బందిపై యువత దాడి వీడియోలు బయటకొచ్చిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు.

అసాంఘిక శక్తుల అదుపు చేయడానికి సైనిక దళాలకు పూర్తి అధికారాలు ఇవ్వాలన్నారు. దాడులకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదని యోగేశ్వర్ ఉద్ఘాటించాడు. అలాంటి అల్లరి మూకలను కట్టడి చేయాలంటే సైనిక బలగాలకు కాస్త స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు.

Anyone misbehaving with our jawans should be shot dead: Yogeshwar Dutt on Kashmir video

అలా కాకుంటే దాడుల ఘటనలు ఆగవని చెప్పారు. భారత జవాన్లతో అనుచితంగా ప్రవర్తించే వారిని అక్కడికక్కడే కాల్చి పారేయాలన్నారు.
అక్కడ జరిగింది ఘోర తప్పిదమని, మన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ను అవమానించారని, అతడి హెల్మెట్‌ను తీసి గాయపరిచారని, ఓ యువకుడు జవాన్‌ను గాయపరుస్తుంటే చూడడం భారత్‌కు అవమానకరమని, బాధాకరమన్నారు.

శ్రీనగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా సీఆర్పీఎఫ్‌ జవాన్లపై స్థానిక యువకులు దాడి జరినట్లు భావిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చేసిన సంగతి తెలిసిందే. వీటిని చూసిన ప్రముఖులు, సినీనటులు సైన్యానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+