జయలలిత.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఛాన్స్..: కొనసాగుతోన్న తీవ్ర ఉత్కంఠ
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంపై హైడ్రామా కొనసాగుతోంది. తమిళనాడు వ్యాప్తంగా అమ్మ అభిమానులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంపై హైడ్రామా కొనసాగుతోంది. తమిళనాడు వ్యాప్తంగా అమ్మ అభిమానులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అక్కడక్కడా అభిమానుల మరణవార్తలు సైతం వినవస్తుండడం దురద్రుష్టకరం. డాక్టర్లు సైతం అంతా దైవాధీనమే అన్న వ్యాఖ్యలు చేస్తుండడం.. జయ ప్రాణాలపై మరింత టెన్షన్ నెలకొనేలా చేస్తోంది.
కాగా, ఆదివారం నాడు గుండెపోటు కారణంగా.. జయలలితకు ఈసీఎంవో(ఎక్స్ట్రాకార్బోరియల్ మెబ్రేన్ ఆక్సిజనేషన్) విధానంలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. సహజ శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేకపోయినప్పుడు ఈ యాంత్రికపరమైన కృత్రిమ వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తారు.

ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమించినప్పుడే మాత్రమే ఈ విధానంలో చికిత్స అందిస్తారు. ఇందులో రోగి బ్రతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రముఖ హృద్రోగ నిపుణులు నరేశ్ ట్రెహాన్ తెలిపారు. ఈసీఎంవో వ్యవస్థపై రోగులకు కొన్ని రోజులు, లేదా కొన్ని వారాలు మాత్రమే జీవించే అవకాశం ఉంటుంది.
రోగి శరీరం వైద్యానికి ఇక ఏమాత్రం సహకరించట్లేదన్న పరిస్థితుల్లో చివరి అవకాశంగా మాత్రమే ఈసీఎంవోపై చికిత్స అందిస్తారు. శరీర రక్తనాళాల నుంచి రక్తాన్ని గ్రహించే ఈ పరికరం, ఆ రక్తాన్ని గుండె, ఊపిరితిత్తుల ద్వారా శరీరానికి సరఫరా చేస్తుంది. ఈ ప్రక్రియలో రక్త కణాలకు అవసరమైన ఆక్సిజన్ కూడా అందుతుంది.కాగా, ఈసీఎంవోపై ప్రముఖులకు మాత్రమే చికిత్స అందిస్తుంటారు.












Click it and Unblock the Notifications