అగ్నిపథ్ తో యువత, ఆర్మీ ఇద్దరికీ ప్రయోజనం-తప్పుదోవ పట్టించొద్దు-ఆర్మీ ఛీఫ్ వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ మనోజ్ పాండే ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం విషయంలో యువతలో నెలకొన్న అపోహలు, ఇతర అంశాలపై జాతీయ మీడియా నెట్ వర్క్ ఆజ్ తక్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు కీలక అంశాలు వెల్లడించారు.
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ, అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని, ఇది యువత మరియు సైన్యం రెండింటికీ ప్రయోజనకరమని తెలిపారు. ఈ పథకంలో ఇకపై సానుకూల మార్పులు ఉంటాయని, దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మరిన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అగ్నిపథ్ పథకం యువకులకు, సైన్యానికి ఇద్దరికీ ఉపయోగపడుతుందన్నారు. ఔత్సాహిక దరఖాస్తుదారులు తప్పుడు సమాచారంతో మోసపోవద్దని ఆయన కోరారు.

తప్పుడు సమాచారంతో యువత మోసపోవద్దని ఆర్మీ ఛీఫ్ మనోజ్ పాండే కోరారు. "భౌతిక, రాత పరీక్షకు సన్నద్ధతపై దృష్టి పెట్టాలని యువతకుఆయన సలహా ఇచ్చారు. అగ్నిపథ్ పథకం తమకు, సైన్యానికి, దేశానికి ప్రయోజనకరమైనదని దేశంలోని యువత అర్థం చేసుకోవాలన్నారు. ఇది సైన్యం, దేశం రెండింటికీ విన్-విన్ సిట్యుయేషన్ అని అన్నారు. కాబట్టి దీనిపై తప్పుదారి పట్టించకండన్నారు. సరైన సమాచారం లేకపోవడం వల్ల పథకంపై భయాలు ఏర్పడుతున్నాయని ఆర్మీ ఛీఫ్ తెలిపారు.












Click it and Unblock the Notifications