రంగంలోకి ఆర్మీ చీఫ్, ఢిల్లీ ఆదేశాలు - ఆపరేషన్ షురూ, LTEటాప్ కమాండర్ హతం..!!

భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాలు దౌత్య పరంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ పోస్టు లపైన కాల్పులకు తెగ బడింది. భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. అటు పహిల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం సైన్యం కూంబింగ్ మొదలు పెట్టింది. కేంద్రం ఆదేశాలతో ఆర్మీ చీఫ్ శ్రీనగర్ చేరుకున్నారు. కీలక సమీక్షలు చేస్తున్నారు. ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేసిన సైన్యం.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హత మార్చింది. సెలవు పై వెళ్లిన సైన్యం తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

లష్కర్ కమాండర్ హతం
పహిల్గాం ఘటన తరువాత భారత సైన్యం వేగంగా అడుగులు వేస్తోంది. పాకిస్థాన్ సిమ్లా ఒప్పందం రద్దు చేయటం ద్వారా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో సమాయత్తం అయింది. అటు ఉదయం నుంచి నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పహిల్గాం దాడిలో అనుమానితులు గా ఉన్న వారి కోసం సైన్యం వేటాడుతోంది. వారి ఇళ్లను కూల్చి వేసింది. జమ్మూ లోని దిపోరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాటాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని భద్రతా దళాలు అంతమొందించాయి. అంతకు ముందు బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు.

army-chief-upendra-dwivedi-has-reached-srinagar-to-review-the-security-situation

సైన్యానికి సెలవులు రద్దు
ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం అప్రమత్తం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసారు. అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తు న్నారు. ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవటానికి సిద్దంగా సమాయత్తం అవుతున్నారు. సెలవుపై వెళ్లిన జవాన్లు తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉగ్రవాదుల నివాసాల్లో భద్రతా దళాలు తఖీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్‌ ఇంటికి వెళ్లగా, అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. అయితే అవి యాక్టివేట్ అయినట్లు తెలియడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది బయటకు వచ్చేశారు. కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో ఆర్మీ జవాన్లకు హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

రంగంలోకి ఆర్మీ చీఫ్

ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి దాడి నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ లోభద్రతా పరిస్థితిని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమీక్షించనున్నారు. శ్రీనగర్‌లో భద్రతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఉగ్ర దాడి జరిగిన బైసరన్ వ్యాలీని సైతం ఆయన సందర్శించనున్నారు. కాశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ వెంబడి సైన్యం తీసుకున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి స్థానిక సైనిక విభాగాల అగ్ర కమాండర్లు ఆర్మీ చీఫ్ కి వివరించనున్నారు. జమ్ముకాశ్మీర్ పర్యటనలో ఆర్మీ చీఫ్ తో పాటు 15 కార్ప్స్ కమాండర్ సహా రాష్ట్రీయ రైఫిల్స్ ఫార్మేషన్ కమాండర్లు సైతం ఉన్నారు. ఇప్పటికే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతా లకు అగ్రశ్రేణి సైనికాధికారుల తరలింపు పూర్తైంది. జమ్ముకాశ్మీర్ లో హై అలర్ట్‌లో ఉండాలని, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని సైనికులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+