Breaking: కూనూర్ లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్- సీడీఎస్ బిపిన్ రాపత్ సహా 9 మంది -ఇద్దరు మృతి

తమిళనాడులోని ఊటీ వద్ద ఓ ఆర్మీ హెలికాఫ్టర్ కొద్దిసేపటి క్రితం కుప్పకూలింది. ఇందులో పలువురు ఆర్మీ అధికారులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు పలువురు అధికారులు ప్రయాణిస్తున్న ఈ హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇది ఆర్మీకి చెందిన ఎంఐ 17 వీ5 ఛాపర్ గా గుర్తించారు.

తమిళనాడులోని కూనూర్‌లో జంట ఇంజిన్లతో కూడిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెల్లింగ్టన్ కాంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి దారితీసినట్లు భావిస్తున్నారు. రావత్ ఊటీలో ఉపన్యాసానికి హాజరయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో బిపిన్ రావత్ భార్య మరియు బ్రిగేడియర్ స్థాయి అధికారి ఉన్నట్లు తెలుస్తోంది.

Army helicopter with CDS Bipin Rawat on board crashes in Tamil Nadu, 3 rescued

మరోవైపు తమిళనాడులోని కూనూర్ లో ఉన్న నీలగిరి కొండల్లో జరిగిందని భావిస్తున్న ఈ ఘటనను ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు ప్రకటించాయి. అటు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెలికాఫ్టర్ దుర్ఘటన వివరాలను ప్రధాని మోడీకి వివరించారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూనూర్ లో ప్రమాదం జరిగిన స్ధలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Army helicopter with CDS Bipin Rawat on board crashes in Tamil Nadu, 3 rescued
Army helicopter with CDS Bipin Rawat on board crashes in Tamil Nadu, 3 rescued
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+