Article 370: జమ్మూకశ్మీర్లో 80ల నుంచి హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు ! తీర్పులో జడ్డి సూచన..

ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ కు ఉన్న స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిన్న ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్ధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని తెలిపింది. 1957లోనే రాజ్యాంగ పరిషత్ రద్దయినా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చెల్లుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అదే సమయంలో ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జడ్జి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. మరో కీలక ఆదేశం కూడా ఇచ్చారు.

ఆర్టికల్ 370పై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో తన అభిప్రాయం రాసిన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. జమ్మూ కాశ్మీర్ లో హక్కుల దుర్వినియోగంపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కీలక సూచన చేశారు. రాష్ట్రంలో సైన్యం ప్రవేశంతో ప్రజలు కొన్ని దశాబ్దాలుగా భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కశ్మీర్ లోయ లోని కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన జస్టిస్ కౌల్.. తాను ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో ఈ సూచన చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

Article 370: SC Justice calls for probe panel on rights abuse in jammu and kashmir since 80s

తీర్పులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. కనీసం 1980ల నుండి రాష్ట్ర, రాష్ట్రేతర మానవ హక్కుల ఉల్లంఘనలను విచారించడానికి, నివేదించడానికి నిష్పాక్షికమైన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసారు. అలాగే లోయలో వర్గాల మధ్య సయోధ్య కోసం చర్యలను సిఫార్సు చేస్తున్నానన్నారు. మరోవైపు తన పదవీ విరమణకు కేవలం 15 రోజుల ముందు జస్టిస్ కౌల్ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

సైన్యాలు శత్రువులపై పోరాడేందుకు ఉంటాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను నియంత్రించడానికి కాదని కౌల్ వ్యాఖ్యానించారు. సైన్యం ప్రవేశం రాష్ట్రంలో దాని స్వంత గ్రౌండ్ రియాలిటీని సృష్టించిందని, పురుషులు, మహిళలు, పిల్లలు దీంతో భారీ మూల్యం చెల్లించుకున్నారు అని జస్టిస్ కౌల్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+