వద్దని, సింగపూర్ పర్యటన ఆంతర్యమేంటి: సీఎంకు జైట్లీ
కోల్‌కతా: రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పెట్టుబడుల కోసం సింగపూర్‌లో పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు.
రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏకీభవించాయని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై తృణమూల్ కాంగ్రెస్ వైఖరి ఏమిటో వెల్లడించాలని నిలదీశారు.

బిజెపి నాయకులు, మేధావులతో సోమవారం కోల్‌కతాలో జరిగిన సమావేశంలో జైట్లీ ఈ డిమాండ్ చేశారు. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మనం 72 శాతం రక్షణ సామగ్రిని విదేశాల నుంచే కొనుగోలు చేస్తున్నామని, ఇటువంటి తరుణంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం రక్షణ రంగంలో దేశం స్వయం స్వావలంబన సాధించేందుకు, ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు దోహదపడుతుందని, ఈ విషయంలో తృణమూల్, వామపక్షాలు మినహా మిగిలిన అన్ని పార్టీలు తమ నిర్ణయంతో ఏకీభవించాయన్నారు.
అయితే జైట్లీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిశ్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ సింగపూర్ పర్యటన వ్యవహారంపై జైట్లీ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications