వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకేం గుర్తు లేదు: అరుణ షాన్‌బాగ్ రేప్ కేసు నిందితుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: అత్యాచారానికి గురై 42 ఏళ్లు కోమాలో ఉన్న నర్సు అరుణ షాన్‌బాగ్ మే 18న మృతి చెందిన కేసులో నిందితుడు సోహన్‌లాల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాడు. అరుణపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితుడు యూపీ హపూర్ జిల్లాలోని పర్పా గ్రామంలో నివసిస్తున్నట్లు ముంబైకి చెందిన సక్కల్ అనే ఓ స్థానిక పత్రిక ప్రచురించింది.

తాను అరుణను అత్యాచారం చేయలేదని, ఆ రోజు ఏం జరిగిందో కూడా గుర్తు లేదని చెప్పాడు. అయితే ఈ కేసును రీ ఓపెన్ చేసేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు సోహన్‌లాల్ కుక్కల గొలుసుతో అరుణను కట్టేసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో సోహన్‌లాల్ 1973లో జైలుకు వెళ్లాడు. 1980లో బెయిల్‌పై విడుదలయ్యాడు.

 Aruna Shanbaug case: Sohanlal denies allegations

నర్సు అరుణ షాన్‌బాగ్ కోమా నుంచి శాశ్వత నిద్రలోకి వెళ్లారు. అరుణ షాన్‌బాగ్ ఈ ఉదయం కెమ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో 42 ఏళ్లుగా మృత్యువుతో పోరాడి ఇవాళ కన్ను మూసిన అరుణ అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో కెమ్ సిబ్బంది, ఆమె బంధువులు పాల్గొన్నారు.

20 సంవత్సరాల వయసులో అరుణ జూనియర్ నర్సుగా కెమ్ ఆస్పత్రిలో చేరారు. 26 ఏండ్ల వయసులో ఆమెపై అదే ఆస్పత్రిలో పని చేస్తున్న వార్డ్ బాయ్ అత్యాచారం చేశాడు. ఆమె తలను గాయపరిచాడు. నాటి నుంచి నేటి వరకు ఆమె కోమాలోనే ఉన్నారు. అరుణకు అన్ని విధాలా నర్సులు సహాయం చేసేవారు. అరుణ మృతితో నర్సులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరుణపై 1973 నవంబర్ 27న అత్యాచారం జరిగింది. అరుణ ప్రస్తుత వయస్సు 68 సంవత్సరాలు.

English summary
Accused in nurse Arun Shanbaug rape case Sohanlal denied allegations made against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X