Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఫోన్ పాస్వర్డ్ చెప్పని కేజ్రీవాల్; యాపిల్ సంస్థ సహాయం కోరిన ఈడీ; యాపిల్ ఏమందంటే!!

అరవింద కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడి అధికారుల విచారణకు సహకరించడం లేదా? ఆయన ఉపయోగించే సెల్ ఫోన్ల పాస్ వర్డ్ లు కూడా ఈడి అధికారులకు చెప్పడం లేదా? ఆయన ఉపయోగించే యాపిల్ మొబైల్ ను ఈడి అధికారులు యాక్సెస్ చేయలేకపోతున్నారా? అంటే అవును అని తెలుస్తుంది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక మలుపు
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను గత నెలలో ఈడి అరెస్టు చేసింది. ఇక తాజాగా లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ కు నేటితో ఈడి కస్టడీ ముగియడంతో, కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Arvind Kejriwal did not tell iPhone password ED sought help from Apple apple inc response

ఆ మొబైల్ ఫోన్స్ పై ఈడీ విచారణ
ఈడీ విచారణలో అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ గురించి పదేపదే అధికారులు ప్రశ్నించారు. అయితే ఆయన ఆ ఫోన్ గురించి తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ తో కలిపి మొత్తం 171 మొబైల్ ఫోన్స్ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ గా ఈడి పేర్కొంది.

కేజ్రీవాల్ మొబైల్ యాక్సెస్ చెయ్యలేకపోయిన ఈడీ
కేవలం 17 మొబైల్ ఫోన్స్ లో నుంచి తీసుకున్న డేటా ఆధారంగానే ఈడీ ఈ కేసును విచారిస్తుంది. అయితే ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించే మొబైల్ ఫోన్ ని కూడా యాక్సెస్ చేయాలని ఈడి అధికారులు ప్రయత్నం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ పాస్వర్డ్ చెప్పకపోవడంతో ఆ మొబైల్ ఫోన్ ను యాక్సెస్ చేయలేకపోయారు. ఆయన యాపిల్ సంస్థ ఐఫోన్ ను ఉపయోగించడంవల్ల పాస్వర్డ్ ఖచ్చితంగా ఉంటేనే అది ఓపెన్ అవుతుంది.

యాపిల్ inc ని సహాయం కోరిన ఈడీ
అత్యధిక భద్రతను యాపిల్ సంస్థ తన కస్టమర్లకు ఇస్తున్న నేపథ్యంలో ఆయన ఫోన్ ను ఈడీ అధికారులు ఓపెన్ చేయలేకపోయారు. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ ను యాక్సెస్ చేయడంలో తమకు సహాయం చేయమని ఈడి యాపిల్ సంస్థను కోరింది.
అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన రోజు ఈడీ అధికారులు ఆయన వద్దనుండి నాలుగు మొబైల్ ఫోన్లను జప్తు చేశారు.

Arvind Kejriwal did not tell iPhone password ED sought help from Apple apple inc response

ఐ ఫోన్ పాస్ వర్డ్ చెప్పని కేజ్రీవాల్

అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన ఐఫోన్ ను స్విచాఫ్ చేసి ఈడి అధికారులకు ఇచ్చారు. అప్పటినుండి ఇప్పటివరకు ఆయన తన ఐఫోన్ కి సంబంధించిన ఈడీ అధికారులకు చెప్పలేదు. అయితే ఈ క్రమంలో యాపిల్ సంస్థ ద్వారా సహాయాన్ని కోరిన ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ కోసం ప్రయత్నించారు.

యాపిల్ సంస్థ సమాధానం ఇదే!!
అయితే యాపిల్ సంస్థ మొబైల్ నుంచి డేటా పొందాలంటే సదరు వినియోగదారుడు పెట్టుకున్న పాస్వర్డ్ కచ్చితంగా అవసరమని పేర్కొంది. దీంతో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ యాక్సెస్ చేయడానికి ఏం చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+