జాతీయ కన్వీనర్‌గా కేజ్రీవాల్ రాజీనామా, చికిత్స కోసం ఆసుపత్రికి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్తగా రాజీనామా చేశారు. ఆయన జాతీయ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆప్ జాతీయ కార్యవర్గానికి కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను పంపారు. రెండు పదవులను సమర్థవంతంగా నిర్వహించటం సాధ్యం కావట్లేదని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో పరిపాలనపై దృష్టి పెడతామని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ రాజీనామాను పార్టీ సీనియర్ నేత అశుతోష్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
జిందాల్ ఆసుపత్రిలో ప్రకృతి చికిత్స
ఎన్నికల సందర్బంగా ఇంతకాలం తీరక లేకుండా గడిపి, అధికారంలోకి వచ్చిన క్రేజీవాల్ 10 రోజుల పాటు సెలవు తీసుకుని ప్రకృతి చికిత్స చేయించుకోవడానికి బెంగళూరు వస్తోన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు (బీజేపీ) ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు.
వారందరికి దీటుగా క్రేజీవాల్ ఒక్కరే ప్రచారం చేశారు. క్రేజీవాల్ చాల కాలం నుండి విపరీతమై దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అదే సమయంలో ఆయనకు చక్కర వ్యాది (షుగర్) ఎక్కువ అయ్యింది. ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయన ఆరోగ్యం అదుపుతప్పింది.

ఆ సందర్బంలో క్రేజీవాల్ సరైన చికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారు. ఎన్నికలు పూర్తి కావడం, క్రేజీవాల్ అధికారంలోకి రావడం జరిగిపోయింది. ఈ సందర్బంలో ఆయన విశ్రాంతి తీసుకుని ప్రకృతి చికిత్స చేయించుకొవాలని నిర్ఱయించారు.
బెంగళూరు - ముంబై జాతీయ రహదారిలోని తుమకూరు రోడ్డులో ఉన్న జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో క్రేజీవాల్ చికిత్స చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్రేజీవాల్ ఇప్పటి వరకు (బుధవారం) అపాయింటుమెంట్తీసుకొలేదని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి.
ఏఏపీ కర్ణాటక బాధ్యతలు చూసుకుంటున్న వారు ఇప్పటకే అపాయింటుమెంట్ తీసుకున్నారని తెలుస్తోంది. క్రేజీవాల్ వస్తున్న విషయం బయటకురాకుండా ఆసుపత్రి వర్గాలు జాగ్రతలు తీసుకుంటున్నాయని సమాచారం. గురువారం క్రేజీవాల్ జిందాల్ ఆసుపత్రి చేరుకుంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications