వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: ఎన్సీబీని టార్గెట్ చేసిన శివసేన, ప్రాధమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంలోమంత్రి పిటీషన్

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. తాజాగా శివసేన నాయకుడు, మహారాష్ట్ర మంత్రి కిషోర్ తివారీ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై దాఖలు చేసిన పిటిషన్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ద్వారా ఆర్యన్ ఖాన్ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని శివసేన నేత కిశోర్ తివారీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ బాధితుడని సుప్రీంలో శివసేన నేత, మంత్రి పిటీషన్
మహారాష్ట్ర మంత్రి కిషోర్ తివారి దాఖలు చేసిన పిటిషన్లో ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క అధికారుల చేత వేధింపులకు గురవుతున్నబాధితుడు ఆర్యన్ ఖాన్ అని, ఎన్సీబీ అధికారి భార్య చిత్ర పరిశ్రమలో రాణించడంలో విఫలమైందని, అందుకే సినీ రంగ ప్రముఖులను నార్కోటిక్స్ అధికారి సమీర్ వాంఖడే టార్గెట్ చేస్తున్నారని శివసేన నాయకుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్ర పాలక పార్టీ శివసేన మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కేంద్రం ఆదేశాల మేరకు ఎన్సీబీ ఆర్యన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది.

Aryan Khan drugs case: Shiv Sena targets NCB, petition in Supreme Court on violation of fundamental rights

డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ సినిమా ప్రముఖులు, మోడళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ
కిషోర్ తివారీ పిటిషన్‌లో డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ సినిమా ప్రముఖులు మరియు మోడళ్లను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు . ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని , "ఆర్యన్ ఖాన్ యొక్క ప్రాథమిక హక్కులను కాపాడాలని" కోరారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని అక్టోబర్ 20 వరకు ప్రభుత్వ సెలవుల కారణంగా వాయిదా వేసిన ముంబై కోర్టులో బెయిల్ విచారణను ప్రస్తావిస్తూ, శివసేన నాయకుడు తివారీ అప్రజాస్వామికంగా మరియు చట్టవిరుద్ధంగా 17 రోజులపాటు, 23 ఏళ్ల యువకుడిని జైల్లో ఉంచి అవమానించారంటూ పేర్కొన్నారు.

ఎన్సీబీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొన్న మంత్రి తివారీ
డ్రగ్స్ తో పట్టుబడకుండా, మరే ఇతర ఆధారాలు లేకుండా ఎవరైనా ఇన్ని రోజులు జైల్లో ఉన్నారంటే నమ్మశక్యం కాని విషయం అని, వినియోగం గురించి వైద్య నివేదిక లేదు, కాబట్టి వినియోగం లేదు అని తివారీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్సీబీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక జీవించే హక్కు, స్వేచ్ఛ ను పూర్తిగా తొలగించే విధానం ఎన్సీబీ అవలంబిస్తోంది అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్ లో ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని, పక్షపాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ తీసుకున్న చర్యపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయించాలని, దర్యాప్తు కోసం ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు .

న్యాయ విచారణకు డిమాండ్ చేసిన శివసేన
ఎన్‌సిబి పాత్రపై దర్యాప్తు చేయాలని తివారీ డిమాండ్ చేశారు. ప్రతీకారంతో ఏజెన్సీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. గత రెండేళ్లుగా డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ సినిమా తారలు, మోడల్స్ మరియు ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నట్లు పిటిషన్‌లో కిషోర్ తివారీ పేర్కొన్నారు. నిజాన్ని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా నిర్వహించాల్సిన ప్రత్యేక న్యాయ విచారణను ఆయన కోరారు. ఇక ఈ పిటీషన్ తో ఆర్యన్ ఖాన్ కేసులో రాజకీయ రగడ మొదలైంది.

తివారీ పిటీషన్ తో రాజకీయ రంగు పులుముకున్న ఆర్యన్ ఖాన్ కేసు
చిత్ర పరిశ్రమలో తన భార్య ఉన్న కారణంగా ఏజెన్సీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సినీ పరిశ్రమకు వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తివారీ తన పిటిషన్‌లో తెలిపారు. ఇక ఈ డ్రగ్స్ వ్యవహారంపై శివసేన చీఫ్ మరియు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ ప్రముఖులను పట్టుకోవడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నారని ఆరోపించారు. ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 8 నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. ఎన్‌సిబి అక్టోబర్ 2 న ముంబై నుండి గోవాకు వెళుతున్న క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీపై దాడి చేసినప్పటి నుండి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 20 మందిని అరెస్టు చేశారు. తాజాగా శివసేన నేత,రాష్ట్ర మంత్రి తివారీ పిటీషన్ తో ఆర్యన్ ఖాన్ కేసు రాజకీయ రంగు పులుముకుంది.

English summary
Shiv Sena leader Kishore Tiwari has filed a petition in the Supreme Court alleging that Aryan Khan's fundamental rights have been violated by the Narcotics Control Bureau (NCB), which is probing the Mumbai cruise drugs case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X