వాట్సప్ చాట్ ల ఆధారంగా డ్రగ్స్ సరఫరా చేశారని నిర్దారించలేం: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు!

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో శనివారం ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సరఫరా చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆచిత్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఎన్డీపీఎస్ ప్రత్యేక న్యాయస్థానం కేవలం వాట్సాప్ చాట్‌ల ఆధారంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహ నిందితుడు అర్బాజ్ మర్చంట్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిర్ధారించలేమని వెల్లడించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) పంచనామా రికార్డులు కల్పితమని, అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపిన న్యాయస్థానం తన వివరణాత్మక ఉత్తర్వులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.

వాట్సప్ చాట్ లు ఆధారాలుగా సరిపోవు

వాట్సప్ చాట్ లు ఆధారాలుగా సరిపోవు

నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టానికి సంబంధించిన కేసులను విచారించేందుకు నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తి వివి పాటిల్ శనివారం 22 ఏళ్ల ఆచిత్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేశారు. ఆర్యన్ ఖాన్‌తో వాట్సాప్ చాట్‌లు మినహా, ఆచిత్ కుమార్ డ్రగ్స్ సరఫరాకి పాల్పడుతున్నట్లు చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తన వివరణాత్మక ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేవలం వాట్సాప్ చాట్‌ల ఆధారంగా, ఆచిత్ కుమార్ నిందితుడు వన్ ఆర్యన్ ఖాన్ కు మరియు నిందితుడు 2 అర్బాజ్ మర్చంట్ కి నిషిద్ధ వస్తువులు సరఫరా చేశాడని నిర్ధారించలేమని పేర్కొంది.

వాట్సప్ లో చాట్ చేస్తే డ్రగ్స్ పెడ్లర్ అని ఎలా నిరూపిస్తారు ?

వాట్సప్ లో చాట్ చేస్తే డ్రగ్స్ పెడ్లర్ అని ఎలా నిరూపిస్తారు ?

ముఖ్యంగా ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్‌లు ఆధారంగా నిందితుడు డ్రగ్స్ పెడ్లర్ అని చెప్పలేమని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అని ఉత్తర్వు పేర్కొంది.క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్, మర్చంట్‌లకు బాంబే హైకోర్టు గత గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇతర నిందితుల్లో ఎవరితోనూ ఆచిత్ కుమార్‌ను కలిపేందుకు, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ప్రత్యేక కోర్టు పేర్కొంది. పంచనామా కల్పితంగా ఉందని, దాడి జరిగిన సమయంలో తయారు చేయబడలేదని, అందువల్ల, పంచనామా కింద చూపబడిన రికవరీ అనుమానాస్పదంగా ఉందని, దానిపై ఆధారపడలేమని కోర్టు పేర్కొంది.

ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆధారాలేవీ?

ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆధారాలేవీ?

ఆచిత్ కుమార్ నిందితుడు ఆర్యన్ ఖాన్ కి లేదా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేశాడని చూపించే ఎటువంటి ఆధారాలు రికార్డులో లేవు కాబట్టి, దరఖాస్తుదారు బెయిల్‌పై విడుదల చేయడానికి అర్హులు" అని ఆర్డర్ పేర్కొంది. ఈ కేసులో నిందితులు ఆర్యన్ ఖాన్ మరియు అర్బాజ్ మర్చంట్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అక్టోబర్ 6న ఆచిత్ కుమార్ ను అరెస్టు చేసింది. ఆచిత్ కుమార్ నివాసం నుంచి 2.6 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ పేర్కొంది.

 నిందితుడు పెడ్లర్‌గా వ్యవహరించిన ఒక్క సందర్భం కూడా ఎన్సీబీ పేర్కొనలేదు

నిందితుడు పెడ్లర్‌గా వ్యవహరించిన ఒక్క సందర్భం కూడా ఎన్సీబీ పేర్కొనలేదు

యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ ప్రకారం, ఆచిత్ కుమార్ ఆర్యన్ ఖాన్ మరియు అర్బాజ్ మర్చంట్ కి గంజాయి మరియు చరస్ సరఫరా చేసేవాడు. ఆచిత్ కుమార్ మరియు ఆర్యన్ ఖాన్ మధ్య వాట్సాప్ చాట్‌ల రూపంలో వారు డ్రగ్స్‌ను డీల్ చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎన్సీబీ వాదించింది. ఆచిత్ కుమార్ తరపు న్యాయవాది అశ్విన్ థూల్ 22 ఏళ్ల యువకుడు నిర్దోషి అని, అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు మరియు నిరాధారమైనవని వాదించారు.కుమార్ పెడ్లర్ అని ఎన్‌సిబి పేర్కొన్నప్పటికీ, ఆచిత్ కుమార్ పెడ్లర్‌గా వ్యవహరించిన ఒక్క సందర్భం కూడా పేర్కొనలేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆర్యన్ కు బెయిల్ ఇచ్చినప్పుడు ఈ నిందితులకు బెయిల్ ఇవ్వాల్సిందే

ఆర్యన్ కు బెయిల్ ఇచ్చినప్పుడు ఈ నిందితులకు బెయిల్ ఇవ్వాల్సిందే

అక్టోబరు 5న కుమార్‌ను అతని ఇంటి నుంచి నిర్బంధించి ఒకరోజు అక్రమ నిర్బంధంలో ఉంచారని, అయితే అక్టోబర్ 6న మాత్రమే అరెస్టు చేసినట్లు చూపారని కూడా పేర్కొంది. కుమార్ మరియు ఆర్యన్ ఖాన్ మధ్య ఏదైనా కుట్ర జరిగిందని చూపించడానికి రికార్డులో ఏమీ లేదని, ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయినప్పుడు, సమానత్వం కారణంగా, కుమార్‌ను కూడా విడుదల చేయవచ్చని కోర్టు పేర్కొంది.ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాకు బాంబే హైకోర్టు గత వారం బెయిల్ మంజూరు చేసింది, మిగిలిన వారికి ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

డ్రగ్స్ కేసులో 20 మందిలో 14 మందికి బెయిల్

డ్రగ్స్ కేసులో 20 మందిలో 14 మందికి బెయిల్

కార్డెలియా క్రూయిజ్‌లో పార్టీ నిర్వహించిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కేన్‌ప్లస్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న మరో నలుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ, వారు ఆర్థికంగా లేదా డ్రగ్స్ కేసులో ఆశ్రయం కల్పించినట్లు చూపించడానికి ఎన్‌సిబి రికార్డులో ఏమీ లేదని పేర్కొంది. నలుగురు నిందితులు సమీర్ సెహగల్, గోపాల్జీ ఆనంద్, మానవ్ సింఘాల్ మరియు భాస్కర్ అరోరా లకు బెయిల్ మంజూరు చ్ర్సింది. ఈ కేసులో అరెస్టయిన మొత్తం 20 మందిలో ఇప్పటి వరకు 14 మందికి బెయిల్ మంజూరైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+