వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: జైల్లో సైన్స్ బుక్స్ చదువుతున్న ఆర్యన్ ఖాన్, ఫోరెన్సిక్ ల్యాబ్ కు మొబైల్ ఫోన్స్!!

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి అక్టోబర్ 7 వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కస్టడీ విధించబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు గోడల మధ్య సైన్స్ పుస్తకాలు తిరగేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్యన్ ఖాన్ కోరిక మేరకు ఎన్సీబీ అధికారులు అతనికి సైన్స్ పుస్తకాలు అందించినట్టు సమాచారం.

ఎన్సీబీ మెస్ ఆర్యన్ ఖాన్ కు భోజనం

ఎన్సీబీ మెస్ ఆర్యన్ ఖాన్ కు భోజనం

మరోపక్క ఆర్యన్ ఖాన్ తో పాటు ఇతర నిందితులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్సీబీ మెస్ నుండి ప్రతిరోజూ భోజనం పెడుతున్నారు. ఎందుకంటే ఇంటి నుండి వండిన ఆహారాన్ని కార్యాలయ ఆవరణలోకి అనుమతించని కారణంగా ఎన్సీబీ మెస్ నుండి భోజన సదుపాయం కల్పించారు. ఆర్యన్ ఖాన్ మరియు ఇతర నిందితుల మొబైల్ ఫోన్‌లు ఫోరెన్సిక్ పరీక్ష కోసం గాంధీ నగర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన అధికారులు మొబైల్ ఫోన్ డేటాను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఈవెంట్ ఆర్గనైజర్స్ ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఈవెంట్ ఆర్గనైజర్స్ ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ

ఇదిలా ఉంటే అక్టోబర్ 5వ తేదీన ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఎన్‌సిబి మరో నలుగురిని అరెస్టు చేసింది. ఈ నలుగురు వ్యక్తులు ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ నమస్‌క్రేలో ఉద్యోగులుగా ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. శనివారం గోవా వెళ్లే క్రూయిజ్ షిప్ పై దాడి చేసిన తర్వాత ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాతో సహా తొమ్మిది మందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా షారూక్ ఖాన్ మేనేజర్, పూజా దడ్లాని షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను కలవడానికి ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం

రేపటితో ఆర్యన్ కస్టడీ ముగింపు.. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఇదే

రేపటితో ఆర్యన్ కస్టడీ ముగింపు.. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఇదే

రేపటితో ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన నార్కోటిక్స్ అధికారులు ఈ కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు అనేక సాక్ష్యాలు లభించినట్టు తెలుస్తుంది. అందులో లభించిన మొదటి సాక్ష్యం స్వయంగా ఆర్యన్ ఖాన్ గత నాలుగు సంవత్సరాలుగా తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెండవ సాక్ష్యం అతని వాట్సప్ చాటింగ్, అతను వాట్సాప్ చాటింగ్ లో డ్రగ్స్ కు సంబంధించిన కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించబడింది అని, అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా తో సంబంధం ఉన్నట్లుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారని చెప్తున్నారు.

ఆర్యన్ ఖాన్ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్న అధికారులు

ఆర్యన్ ఖాన్ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్న అధికారులు

ఎన్సీబీ అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ఆర్యన్ ఖాన్ తన స్నేహితుల ద్వారా డ్రగ్స్ తీసుకున్నారని, అప్పుడప్పుడు డ్రగ్స్ పెడ్లర్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు.డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసి, క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేశాడని ఎన్సీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అతని బ్యాంకు ఖాతాలు కూడా తనిఖీ చెయ్యనున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇంకేమైనా కీలక వ్యక్తులు ఉన్నారా అన్న దానికి, ఎలాంటి బాలీవుడ్ మూలాలు లభించలేదని నార్కోటిక్స్ అధికారులు పేర్కొన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెల్లడించారు.

English summary
Aryan Khan was arrested in the Mumbai Cruise Ship Drugs case and remanded in custody by NCB till October 7. Aryan Khan, is currently in jail, reading science books within the prison walls and meal from the NCB Mess.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X