రిసార్ట్‌కు డీజీపీ-సీఎస్: చేజారకుండా శశికళ వీడియో కాన్ఫరెన్స్
అన్నాడీఎంకే అధినేత్ర శశికళ రిసార్టులలో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారనే అంశంపై హైకోర్టు ఈ రోజు స్పందించింది.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్ర శశికళ రిసార్టులలో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారనే అంశంపై హైకోర్టు ఈ రోజు స్పందించింది.
అదే సమయంలో డిజిపి, సీఎస్ గిరిజా వైద్యనాథన్‌లు ఈ రోజు ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారుతారోననే భయంతో శశికళ వారితో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తోంది. మరోవైపు, తన వర్గం నుంచి ఎమ్మెల్యేలు చేజారుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌తోనూ శశికళ వర్గం మంతనాలు జరుపుతోంది.

కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరించడం ఖాయమని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి ఇప్పటికే చెప్పారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలంతా చిన్నమ్మతోనే ఉన్నారని స్పష్టం చేశారు.
అమ్మ అభిమానులంతా పార్టీతోనే ఉన్నారని, పార్టీకి వెన్నుపోటు పొడిచేవారు అమ్మ అభిమానులమని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. చిన్నమ్మ వర్గం ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం లేదన్నారు. బల నిరూపణ జరిగితే పన్నీర్ సెల్వానికి మద్దతిస్తామని డీఎంకే చెప్పడం రాజకీయ అనైతికమన్నారు.












Click it and Unblock the Notifications