ట్విస్ట్: రాహుల్‌తో జెడియూ నేత శరద్ యాదవ్ భేటీ, పార్టీలో చీలిక?
బీహర్‌లో క్షణాల్లో రాజకీయాలు మారిపోతున్నాయి. ఆరవసారి బీహర్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ వ్యవహరం నచ్చిన కొందరు పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
న్యూఢిల్లీ: బీహర్‌లో క్షణాల్లో రాజకీయాలు మారిపోతున్నాయి. ఆరవసారి బీహర్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ వ్యవహరం నచ్చిన కొందరు పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. జెడియూ కీలకనేత శరద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ ఎంపిలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
బీహర్‌లో మహకూటమి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్..లాలూతో పాటు ఆయన కొడుకు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేయాలని కోరారు.

అయితే రాజీనామా చేసేందుకు తేజస్వి యాదవ్ ససేమిరా అన్నారు.ఇదే విషయాన్ని లాలూ కుండబద్దలు కొట్టారు.దీంతో బుదవారం సాయంత్రం నితీష్ తన పదవికి రాజీనామా చేశారు.
బిజెపి మద్దతుతో గురువారంనాడు ఆయన 6వ, దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నితీష్ బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆ పార్టీ కీలకనేత శరద్ యాదవ్ గురువారంనాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. శరద్‌యాదవ్ రాహుల్‌తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
అత్యవసరంగా శరద్ యాదవ్ పార్టీ ఎంపిల సమావేశాన్ని కూడ ఏర్పాటుచేశారు. మరో వైపు జెడియూ ఎమ్మెల్యేలు కూడ బిజెపితో మైత్రిని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ తరుణంలో పార్టీలో చిలీక వచ్చేఅవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.
అయితే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం లేదని ఆ పార్టీ ప్రకటించింది. తామంగా సమైఖ్యంగా ఉన్నామని ఆ పార్టీ ప్రకటించింది. బిజెపితో నితీష్ చేతులు కలపడాన్ని కేరళశాఖ తీవ్రంగా ఖండించింది. రాజ్యసభసభ్యుడు, ఆ పార్టీ కేరళశాఖ అధ్యక్షుడు వీరేంద్రకుమార్ నితీష్‌పై నిప్పులు చెరిగారు.
రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొనేందుకు సిద్దమేనని ప్రకటించారు. ఫాసిస్టు శక్తులతో పోరాడేందుకు తాను ఎంత మూల్యాన్నైనా చెల్లించేందుకు సిద్దమేనని చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications