కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ ? రాజస్తాన్ సీఎం పదవిపైనే సస్సెన్స్ !

సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ఓవైపు యువనేత రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు సిద్దంగా లేరు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ రేపు ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ ను ఒప్పించేందుకు తుది ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి విఫలమైతే మాత్రం రాజస్దాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఎంపీ శశిథరూర్ మధ్య పోటీ ఉండే అవకాశముంది. ఇందులోనూ గెహ్లాట్ వైపే మొగ్గు కనిపిస్తోంది.

 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు రేపు తెరలేవబోతోంది. రేపు ఎన్నికలకు లాంఛనంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియను సెప్టెంబరు 25 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించి ఫలితం రెండు రోజుల తర్వాత విడుదల చేస్తారు. ఇందుకోసం ఎన్నికల కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీకి సంబంధించిన 9 వేల మంది ప్రతినిధులు కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు.

 అశోక్ గెహ్లాట్ వర్సెస్ శశిథరూర్

అశోక్ గెహ్లాట్ వర్సెస్ శశిథరూర్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రధానంగా ఇద్దరు పోటీ పడబోతున్నారు. ఇందులో రాజస్తాన్ సీఎం, సీనియర్ నేత అయిన అశోక్ గెహ్లాట్ తో కేరళకు చెందిన పార్టీ ఎంపీ శశిథరూర్ పోటీ పడబోతున్నారు. వీరిద్దరూ వీరిద్దరూ సీనియర్లే అయినా థరూర్ తో పోలిస్తే గెహ్లాట్ సీనియర్ నేత, పలుమార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన నేత కూడా. అలాగే గెహ్లాట్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వీర విధేయుడు కాగా.. శశిధరూర్ రాహుల్ కు వ్యతిరేకంగా గళం విప్పిన జీ23 నేతల్లో ఒకరు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. వీరిద్దరిలో సహజంగానే గెహ్లాట్ కు అధిష్టానం అండగా నిలిచే అవకాశం ఉంది.

 కాంగ్రెస్ బాస్ గా గెహ్లాట్ ?

కాంగ్రెస్ బాస్ గా గెహ్లాట్ ?

కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు కనిపిస్తోంది. అయితే యువనేత రాహుల్ గాంధీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్న గెహ్లాట్.. చివరిసారిగా ఆయన్ను భారత్ జోడో యాత్రలో కలిసి అధ్యక్ష పగ్గాలు తీసుకోవాల్సిందిగా కోరబోతున్నారు. రాహుల్ కాదంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియలో గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే రాహుల్ అధ్యక్ష పదవిని నిరాకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నందున గెహ్లాట్ కు కాంగ్రెస్ పగ్గాలు దక్కడం ఖాయంగా ప్రచారం జరుగుతోంది.

 రాజస్తాన్ సీఎంపైనే సస్పెన్స్

రాజస్తాన్ సీఎంపైనే సస్పెన్స్

అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడి గెలవడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో రాజస్తాన్ సీఎం పదవి ఎవరికివ్వాలనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నా రాజస్తాన్ సీఎం పదవిలో ఉంటానని గెహ్లాట్ చెప్తున్నారు. కానీ పార్టీలో జోడు పదవులకు వ్యతిరేకంగా గతంలో చేసిన తీర్మానం ప్రకారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడయితే రాజస్తాన్ సీఎంగా మరో నేతను వెతుక్కోవాల్సిందే. అదే జరిగితే గెహ్లాట్ తర్వాత రాష్ట్రంలో ఆదరణ కలిగిన యువనేత సచిన్ పైలట్ తెరపైకి వస్తారు. కానీ గెహ్లాట్ దీనికి అంగీకరించే అవకాశాలు తక్కువ. కాబట్టి ఏం జరుగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+