Video viral:గంభీర్ అక్మల్ మధ్య గొడవ-భజ్జీ సిక్స్, ఇది కదా దాయాదుల పోరంటే..!
Asia cup 2023: భారత్‌లో క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తారు. అంతేకాదు ఈ ఆటను చాలా ఆస్వాదిస్తారు. అందుకే దేశంలో ఏ క్రీడకు దక్కని ప్రాధాన్యత ఒక్క క్రికెట్‌కు మాత్రమే ఉంటుంది. జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ.. క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ హాకీకి లేదు. దీంతో క్రికెట్ క్రీడ ఇప్పుడు కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. మరో రెండ్రోజుల్లో ఆసియా కప్ 2023 (Asia Cup)లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొట్టబోతోంది. వాతావరణం సహకరిస్తే దాయాదుల పోరు పీక్స్‌లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో భారత్ - పాక్ మధ్య జరిగిన ఆసియాకప్ థ్రిల్లింగ్ మ్యాచ్ మీకోసం.
ఆసియా కప్‌లో అందరికీ గుర్తుండిపోయేలా కొన్ని మెమొరబుల్ మ్యాచ్‌లు భారత్ పాక్ మధ్య జరిగాయి. కొన్ని మ్యాచ్‌లు వన్‌సైడెడ్‌గా జరిగినప్పటికీ... అందులో కొందరు వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య 14 సార్లు ముఖాముఖి పోరు జరిగింది.ఇందులో భారత్ 8 సార్లు గెలిచి పైచేయి సాధించగా... పాక్ 5 మ్యాచ్‌లు గెలిచింది.1997లో ఒకసారి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది. ఇదిలా ఉంటే 2008 నుంచి 2018 మధ్య అంటే పదేళ్లలో పాకిస్తాన్ భారత్‌పై ఒక్కసారి మాత్రమే గెలవగలిగింది. ఆ మ్యాచ్ కూడా చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది.దాయాదుల పోరులో ఎప్పుడూ గుర్తుండిపోయే మ్యాచ్ ఒకసారి చూద్దాం.

దంబుల్లా 2010 (గ్రూప్ మ్యాచ్) : 3 వికెట్లతో భారత్ విజయం
2010 ఆసియాకప్‌లో దంబుల్లా వేదికగా భారత్ పాక్ మ్యాచ్ జరిగింది. హర్భజన్ సింగ్ కొట్టిన ఆ సిక్స్ ఎప్పటికీ మర్చిపోలేము.ఇదే మ్యాచ్‌లో గంభీర్ 97 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌లో పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ గంభీర్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం ముగిసింది.మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 267 పరుగులు చేసింది. సల్మాన్ భట్ 74 పరుగులు చేశారు.
The Attitude, Aggression 🔥🔥
— Michael Scofield (@ScofieldReddy) October 14, 2021
Gambhir vs K Akmal #HappyBirthdayGautamGambhir #HappyBirthdayGG #gautamgambhir pic.twitter.com/7JumWm18Y4
ఇక చేజింగ్‌లో గంభీర్ రెచ్చిపోయాడు. వీరేందర్ సెహ్వాగ్, విరాట్ కోహ్లీలు వెంటవెంటనే వెనుదిరగడంతో ఆటను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ధోనీ తీసుకున్నాడు. ధోనీతో కలిసి గంభీర్ 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఇక షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్‌లు వెంట వెంటనే ధోనీ, రోహిత్ శర్మలను ఔట్ చేశారు. ఇక బరిలోకి దిగిన రైనా 27 బంతుల్లో 34 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
రైనా కూడా ఔట్ అవడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. రైనా ఔటయ్యాక బరిలోకి దిగిన హర్భజన్ సింగ్ మొహ్మద్ ఆమిర్ వేసిన బంతిని సిక్స్‌గా మలిచి భారత్‌కు విజయం అందించాడు. అప్పటి వరకు నిప్పులు చెరుగుతూ బంతులు విసిరిన ఆమిర్... భజ్జీ ముందు ఆనలేకపోయాడు. ఇక భజ్జీ కొట్టిన ఆ ఒక్క సిక్స్ ప్రపంచ క్రికెట్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. మొహ్మద్ ఆమిర్ మొహం తెల్లబోయింది. పాక్ అభిమానులు ఆమిర్‌ను విలన్‌లా చూశారు. భారత్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.












Click it and Unblock the Notifications