Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా2023 షో: ప్రారంభించనున్న ప్రధాని మోడీ; ప్రధాన ఆకర్షణలివే!!

ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో .. ఏరో ఇండియా2023. బెంగళూరులో నేడు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఏరో షో ఏరో ఇండియా 2023 ఈరోజు అట్టహాసంగా బెంగళూరులో ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బెంగళూరులో ఏరో ఇండియా 2023 షోను ప్రారంభించనున్నారు. ఏరో ఇండియా 2023 14వ ఎడిషన్ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం కోసం, స్వదేశీ పరికరాలను, సాంకేతికతలను ప్రదర్శించే దిశగా సాగుతుంది.

ఐదురోజుల పాటు అట్టహాసంగా ఏరో ఇండియా 2023

ఐదురోజుల పాటు అట్టహాసంగా ఏరో ఇండియా 2023

ఐదు రోజులపాటు జరిగే ఈ ఏరోషోలో ఏరోబాటిక్స్, ఎగ్జిబిషన్లతోపాటు, ఉత్కంఠ భరితమైన ఎయిర్ షోలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. భారతదేశ అతిపెద్ద ఏరోస్పేస్ రక్షణ ఎగ్జిబిషన్ అయినా ఏరో ఇండియా షో మేకిన్ ఇండియా ప్రచారంలో భాగంగా దేశీయ విమాన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతోంది. 98 దేశాలకు చెందిన దాదాపు 89 కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఈ ఏరో షోలో రకరకాల విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పాటు, విమానరంగ కంపెనీల ఉత్పత్తులు, రక్షణ రంగ కంపెనీల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.

ప్రధాన ఆకర్షణగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా ఉత్పత్తుల ప్రదర్శన

ప్రధాన ఆకర్షణగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా ఉత్పత్తుల ప్రదర్శన

బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ లో ఏరో ఇండియా షో ప్రదర్శన ఉంటుంది. ఇక ఈ ప్రదర్శనకు సంబంధించి అక్కడే ఫుల్ గా రిహార్సల్స్ కూడా జరిగాయి. ఈరోజు ప్రధానమంత్రి ఈ షోని ప్రారంభించే సమయంలో చేసే విన్యాసాలు కూడా ఆకట్టుకుంటాయని పలువురు భావిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా విధానం ప్రకారం షో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. లాక్ హీడ్ మార్టిన్ కార్ప్, బోయింగ్ మరియు ఎయిర్ బస్ వంటి తయారీదారులు సాంకేతికతను పంచుకునేలా ప్లాన్ చేయబడింది. వివిధ భారతీయ మరియు విదేశీ రక్షణ సంస్థల మధ్య 7500 కోట్లు పెట్టుబడుల అంచనాతో 251 ఒప్పందాలను ఏరో ఇండియా 2023 వేదికగా కుదుర్చుకునే అవకాశం ఉంది.

దేశీయ విమాన రంగాన్ని ప్రచారం చేస్తూ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే దిశగా ప్రదర్శన

దేశీయ విమాన రంగాన్ని ప్రచారం చేస్తూ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే దిశగా ప్రదర్శన

యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలలో ఒకటైన ఎఫ్ 16 ఫైటింగ్ ఫాల్కన్ ద్వయం రోజువారీ వైమానిక ప్రదర్శనలను నిర్వహించనుంది. ఇక నేడు ఎఫ్/ ఏ 18E మరియు ఎఫ్/ ఏ 18F సూపర్ హార్నెట్, యూఎస్ నేవీ యొక్క అత్యంత అధునాతన ఫ్రంట్ లైన్ క్యారియర్ ఆధారిత మల్టీ రోల్ స్ట్రైక్ ఫైటర్ కూడా ప్రదర్శనలో భాగం తీసుకోనున్నాయి. ఇక ఈ ఏరో ఇండియా 2023 ప్రదర్శన దేశీయ విమాన రంగాన్ని ప్రచారం చేస్తూ అందుకు అనుగుణంగా విదేశాలలో తమ బ్రాండ్ ను పునర్నిర్మించుకోవడానికి భారతదేశం చేసే ప్రయత్నాలను కలిగి ఉంటుందని తెలుస్తుంది. "ది రన్‌వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్" 2023 ఏరో ఇండియా థీమ్ గా చెప్పబడింది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+