ఈ అడవే మన సింహాలకు కొత్త ఇల్లు.. నయా సామ్రాజ్యం ఎక్కడంటే?

ఒక శతాబ్దానికి పైగా గుజరాత్‌ అనగానే మనకు టక్కున గుర్తువచ్చేది ప్రఖ్యాత గిర్ అడవులు. ఆసియా సింహాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ గిర్ ప్రాంతం నుంచి ఇప్పుడు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. శతాబ్దాల తర్వాత సరికొత్త అడవులు సింహాలకు సురక్షితమైన ఆవాసాలుగా మారుతున్నాయి. పోర్‌బందర్, దేవభూమి ద్వారక జిల్లాల పరిధిలోని కఠినమైన కొండలు, దట్టమైన బర్దా అడవులు ఇప్పుడు సింహాల కొత్త గూడుగా రూపాంతరం చెందుతున్నాయి.

చరిత్ర పుటలను వెనక్కి తిప్పితే.. దాదాపు 144 సంవత్సరాల క్రితం బర్దా అడవుల్లో సంచరించిన సింహాలు కాలక్రమేణా అక్కడ కనుమరుగయ్యాయి. అయితే, చాలా కాలం తర్వాత గిర్ అడవుల నుంచి ఒక మగ సింహం అడుగుపెట్టడం, ఆ తర్వాత గుజరాత్ అటవీ శాఖ ఐదు ఆడ సింహాలను అక్కడికి తీసుకురావడంతో సరికొత్త చరిత్ర మొదలైంది. ఏళ్ల తరబడి నిర్మానుష్యంగా మారిన ఆ అడవులు మళ్లీ సింహాల గర్జనలతో కళకళలాడుతున్నాయి. ప్రముఖ జర్నల్ 'ప్లస్ వన్' లో ప్రచురితమైన ప్రత్యేక అధ్యయనం ద్వారా ఈ విషయాలు వెలుగుచూశాయి.

Asiatic Lions Find New Refuge in Barda Sanctuary as Population Expands Beyond Gir Forest Stronghold

వసతులు, వన్యప్రాణుల సంపదతో కళకళ

సుమారు 192.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బర్దా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ.. సింహాల దీర్ఘకాలిక మనుగడకు సరిగ్గా సరిపోతుందని పరిశోధకులు తేల్చారు. ఈ అడవుల్లో విభిన్న రకాల వృక్ష సంపద, ఎన్నో అరుదైన జీవవైవిధ్య మొక్కలు ఉన్నాయి. సింహాలకు అవసరమైన ఆహారం, నీరు, ప్రశాంతమైన జీవన విధానానికి కావాల్సిన అన్ని వాతావరణ పరిస్థితులు ఇక్కడ పుష్కలంగా ఉన్నట్లు స్టడీ స్పష్టం చేసింది.

దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్
దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్

17 సింహాలతో కొత్త ఆవాసం.. పకడ్బందీ నిఘా

ప్రస్తుతం బర్దా అడవుల్లో మొత్తం 17 ఆసియా సింహాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. వీటి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆరు సింహాలకు రేడియో కాలర్లను అమర్చి, జీపీఎస్ ద్వారా వాటి ప్రతి కదలికను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. సింహాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఎనిమిది మంది ట్రాకర్లను రంగంలోకి దించడంతో పాటు, ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆహార కొరత లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు

సింహాలకు సహజమైన ఆహార లభ్యతను పెంచేందుకు అటవీ శాఖ అధికారులు మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. గిర్ అడవుల నుంచి వందలాది చుక్కల జింకలను బర్దా అడవులకు తరలించారు. శాకాహార జంతువుల సంఖ్యను పెంచడం ద్వారా సింహాలకు నిరంతరం ఆహారం దొరికేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల సింహాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అక్కడే స్థిరపడేందుకు అవకాశం ఏర్పడింది.

రక్తం మరిగిన సింహాలకు చెక్: 100 హెక్టార్లలో ఐసోలేషన్ పార్క్...
రక్తం మరిగిన సింహాలకు చెక్: 100 హెక్టార్లలో ఐసోలేషన్ పార్క్...

పర్యాటకంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు

పర్యావరణాన్ని కాపాడుతూనే స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బర్దా అడవుల్లో ఎకో-టూరిజంను విజయవంతంగా ప్రారంభించారు. నేచర్ గైడ్లుగా, సఫారి ఆపరేటర్లుగా స్థానికులకు ఉపాధి లభిస్తోంది. దీంతో ఇక్కడకు వచ్చే టూరిస్టుల సంఖ్య విపరీతంగా పెరిగింది. తొలి సంవత్సరంతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడం విశేషం.

అడవుల అభివృద్ధిలో స్థానికుల భాగస్వామ్యం

కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, స్థానిక ప్రజలు కూడా అడవుల సంరక్షణలో భాగంగా భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ప్రమాదకర కలుపు మొక్కలను తొలగించడం, అడవులను పునరుద్ధరించడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం వంటి పనులను ముమ్మరం చేశారు. సుమారు 3,200 హెక్టార్లలో ఆవాస మెరుగుదల పనులు చేపట్టడంతో బర్దా అడవులు సింహాలకు తిరుగులేని రెండో నివాస స్థానంగా ఎదుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+