Wife: అక్రమ సంబంధం, ఆంటీ మీద డౌట్, నాతో డ్యూటీ చెయ్యమంటే బాయ్ ఫ్రెండ్ తో ఓవర్ డ్యూటీ చేస్తావా ?
ఉద్యోగం నుంచి రాత్రి లేటుగా ఇంటికి వస్తున్న భార్య మీద భర్తకు అనుమానం పెరిగింది. భార్య ఓవర్ డ్యూటీ చేసి వస్తున్నానని భర్తకు చెబుతూ వచ్చింది. నాతో డ్యూటీ చెయ్యమంటే నీ ప్రియుడితో ఓవర్ డ్యూటీ చేస్తున్నావా ?
చెన్నై/ రాణిపేట్/వేలూరు: వివాహం చేసుకున్న దంపతులకు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కుమార్తె పెళ్లి చేసుకుని అత్తారింటిలో భర్తతో కలిసి సంతోషంగా ఉంటున్నది, కొడుకు కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం వరకు దంపతులు చాలా సంతోషంగానే ఉన్నారు. భార్య ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. భర్త బేకారుగా తిరగడం మొదలుపెట్టాడు. ఉద్యోగం నుంచి రాత్రి లేటుగా ఇంటికి వస్తున్న భార్య మీద భర్తకు అనుమానం పెరిగింది. భార్య ఓవర్ డ్యూటీ చేసి వస్తున్నానని భర్తకు చెబుతూ వచ్చింది. నాతో డ్యూటీ చెయ్యమంటే నీ ప్రియుడితో ఓవర్ డ్యూటీ చేస్తున్నావా ? అంటూ భర్త రగిలిపోయాడు. కొంతకాలంగా దంపతుల మధ్య ఇదే పంచాయితీ జరుగుతోంది. కొడవలి తీసుకున్న భార్య ఆమె భర్తను నరికేసింది. కసి తీరకపోవడంతో సుత్తి తీసుకుని భర్త తల మీద చితకబాది చంపేసింది.

దంపతులు హ్యాపీ
తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలోని వాలాజీపేట (వేలూరు జిల్లా సమీపంలో) శివార్లలోని ఓగుకూరు గ్రామంలో ఏళుమలై అనే మేస్త్రీ నివాసం ఉంటున్నాడు. 22 ఏళ్ల క్రితం ఏళుమలై కళాసెల్వి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ఏళుమలైన కళాసెల్వి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులు ఇరు వైపుల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి వచ్చేవారు.

చెన్నైలో కూతురు
ఏళుమలై, కళాసెల్వి దంపతు కుమారుడు శరవణన్ వేలూరులోని ప్రముఖ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు. ఏళుమలై, కళాసెల్వి దంపతుల కుమార్తె నందిని వివాహం చేసుకుని చెన్నైలో ఆమె భర్తతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తోంది. తల్లిదండ్రులు ఏళుమలైన కళాసెల్విని చూడటానికి నందిని చెన్నై నుంచి ఆమె భర్తతో కలిసి సొంత ఊరుకు వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్లీ చెన్నై వెలుతోంది.

మద్యం మత్తులో ఆంటీ మొగుడు
మేస్త్రీ పని చేస్తున్న ఏళుమలై మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజూ రాత్రం మద్యం తాగి ఇంటి వెళ్లి అతని భార్య కళాసెల్వితో ఏదో ఒక విషయంలో గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యంకు విపరీతంగా బానిస అయిన ఏళుమలై ఉదయం, మద్యాహ్నం కూడా మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పూర్తిగా మద్యంకు బానిస అయిన ఏళుమలైన పనికి వెళ్లకుండా రెండు సంవత్సరాల నుంచి కాలం గడిపేస్తున్నాడు.

ఉద్యోగంలో చేరిన ఆంటీ
ఏళుమలై పనికి వెళ్లకపోవడంతో కుటుంబ పోషణకు వేరే దారిలేక, కొడుకు కాలేజ్ ఫీజులు కట్టడానికి కళాసెల్వి మంతంగల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ తోళ్ల కర్మాగారంలో సూపర్ వైజర్ గా ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెలుతున్న కళాసెల్వి సాయంత్రం ఇంటికి వెలుతోంది. ఉద్యోగం చేస్తున్న కళాసెల్వి ఆమె కొడుకు శరవణను కాలేజ్ లో చదివిస్తూ తాగుబోతు భర్త ఏళుమలైని పోషిస్తున్నది.

అందంగా ఉన్న ఆంటీ మీద డౌట్
కళాసెల్వికి ప్రస్తుతం 49 ఏళ్లు. కళాసెల్విని చూస్తే ఆమెకు అంత వయసు ఉందని ఎవ్వరూ అనుకోరు. ఎర్రగా, పొడవుగా, లావుగా ఉన్న భార్య కళాసెల్వి ప్రతిరోజు అందంగా రెడీ అయ్యి ఉద్యోగం చెయ్యడానికి వెలుతుంటే తాగుబోతు మొగుడు ఏళుమలైకి అనుమానం మొదలైయ్యింది. సాయంత్రం ఇంటికి వస్తున్న భార్య కళాసెల్వితో ఆమె భర్త ఏళుమలై గొడవలు పెట్టుకొవడం మొదలుపెట్టాడు.

ప్రియుడితో ఓవర్ డ్యూటీ చేస్తున్నావా ?
సాయంత్రాల్లో కంపెనీలో ఓవర్ టైం పని చేస్తున్న కళాసెల్వి రాత్రి పని నుంచి ఆలస్యంగా ఇంటి వెలుతోంది. రాత్రి ఆలస్యంగా వచ్చిన ప్రతిసారి మద్యం మత్తులో ఉన్న ఏళుమలై అతని భార్య కళాసెల్వి తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ చితకబాదడం మొదలుపెట్టాడు. తాను ఓవర్ డ్యూటీ చేసి వస్తున్నానని కళాసెల్వి చెబుతోంది. అయితే నాతో డ్యూటీ చెయ్యకుండా నీ ప్రియుడితో తిరుగుతూ ఓవర్ డ్యూటీ చేస్తున్నావా అంటూ ఏళుమలై అతని భార్య కళాసెల్విని చితబాదేసి ఆమెను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

భర్తను కొడవలితో నరికేసి.... సుత్తితో చితకబాది చంపేసిన భార్య
శుక్రవారం ఉదయం కళాసెల్వి కుమారుడు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో ఉన్న ఏళుమలై ఉద్యోగానికి వెలుతున్న భార్య కళాసెల్వితో గొడవపెట్టుకున్నాడు. రోజు ఉన్న పంచాయితీనే కదా అంటూ పట్టించుకోకుండా కళాసెల్వి ఉద్యోగానికి వెళ్లిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన కళాసెల్వితో ఆమె భర్త ఏళుమలై వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కళాసెల్వి ఆగ్రహంతో ఊగిపోయి ఇంట్లో ఉన్న కొడవలితో ఏళుమలై తల మీద నరికేసింది. కోపం తగ్గకపోవడంతో ఇంటిలో ఉన్న సుత్తితో భర్త ఏళుమలై తల మీద చితకబాదేసింది.

మద్యం మత్తులో భార్యను ఏం చెయ్యలేకపోయాడు
అప్పటికే పీకలదాక మద్యం సేవించిన ఏళుమలైన అతని భార్య కళాసెల్విని ఎదిరించలేక, ఆమెను అడ్డుకోలేక తీవ్రగాయాలై కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వాలాజీపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు ఏళుమలై మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వాలాజీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ఏళుమలైని అతి దారుణంగా నరికి చంపిన అతని భార్య కళాసెల్విని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం వియషంలో భార్య ఆమె భర్త ను కొడవలితో నరికి, సుత్తితో దాడి చేసి హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications