ఉగ్ర దాడి ఘటనలో వెలుగులోకి సంచలన అంశం - ఆంక్షలున్నా అనుమతించెదెవరు..!!
జమ్ము కాశ్మీర్ లో ఉగ్రదాడి తో యావత్ దేశాన్ని కలిచి వేసింది. ప్రపంచ దేశాలు ఉగ్రవాదుల దాడు లను ఖండించాయి. భారత్ కు మద్దతు ప్రకటించాయి. ఈ దాడికి కారకులను వదిలేది లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. భారత్ - పాక్ మధ్య దౌత్య పరమైన కఠిన నిర్ణయాలు రెండు దేశాల అధినేతలు ప్రకటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. దాడి కారణాలు.. చర్యల పైన కేంద్రానికి అన్ని పార్టీలు బాసటగా నిలిచాయి. ఇదే సమయంలో ఈ ఘటన వెనుక విస్తుపోయే అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది సంచలనంగా మారుతోంది.
బైసరన్ లోయ
ఉగ్ర దాడి జరిగిన బైసరన్ లోయ కు ఒక ప్రత్యేకత ఉంది. పొడవైన పచ్చికబయళ్లతో ఆహ్లాదకర వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గామ్‌లో పెద్ద సంఖ్యలో టూరిస్టులు రావటం మొదలైంది. ఈ సమయంలోనే కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ లోయలోని పర్వతం పైనుంచి దిగివచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. 38రోజులపాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర జులై 3నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్‌నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48కిలోమీటర్ల దూరం ఉండగా, గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించి ఈ ప్రాంతం లో దాడికి ఎంపిక చేసుకున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకున్నారు.

సమాచారం లేదా..!
పహల్గాం ఉగ్రదాడి పైన కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహంచింది. భద్రతా వైఫల్యం పైన చర్చ జరిగింది. ఆ సమయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దాడి జరిగిన బైసరన్ లోయ పర్యాటకుల కోసం తెరిచినట్లు స్థానిక అధికారులు భద్రతా సిబ్బందికి చెప్పలేదని ప్రభుత్వం వెల్ల డించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సాధారణంగా జూన్ నుంచి ప్రారంభం అయ్యే అమర్ నాథ్ యాత్ర వరకు ఈ లోయ వద్దకు పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు ఉంటాయని చెబుతున్నారు. ఈ సారి భద్రతా ఎజెన్సీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే స్థానిక అధికారులు బైసరన్ కు పర్యాటకులను అనుమతించారని చెప్పినట్లు తెలుస్తోంది. ఎత్తులో ఉండే ఈ ప్రాంతానికి చేరుకోవలంటే 45 నిమిషాలు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దాని పైన ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదని పేర్కొన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications