పెట్రో ధరలు?: ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి సారీ చెప్పిన బీజేపీ అధ్యక్షురాలు, స్వీట్లు కూడా పంచారు!
చెన్నై: గత కొద్దిరోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రశ్నించిన కదిర్ అనే ఆటోడ్రైవర్‌ను ఇటీవల బీజేపీ నేత కాళిదాస్ బయటికి తోసేసిన ఘటన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందరరాజన్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే, కదిర్ తాగున్నాడని అందుకే గెంటేశారని తమిళిసాయి మీడియా ద్వారా వెల్లడించారు. కానీ, తన తప్పును తెలుసుకున్న తమిళిసాయి.. కదిర్ ఇంటికి వెళ్లి స్వీట్లు పంచి మరీ ఆయనకు క్షమాపణాలు చెప్పారు. అతని ఇంటికి వెళ్లినప్పుడు తీసిన వీడియోని తమిళిసాయి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
சென்னையில் பாஜகவினரால் தாக்கப்பட்டதாக கூறப்பட்ட ஆட்டோ ஓட்டுநரின் வீட்டிற்கு சென்று தமிழிசை சவுந்தரராஜன் நலம் விசாரிப்பு #TamilisaiSoundararajan @DrTamilisaiBJP pic.twitter.com/9vF7Z7VKSk
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) September 18, 2018
తమిళిసాయి తన ఇంటికి రావడంపై కదిర్ స్పందించారు. 'తమిళిసాయి మేడమ్ మా ఇంటికి వచ్చారు. నాపై చెయ్యి చేసుకున్న సంగతి తనకు తెలియదని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు కాబట్టి పెట్రోల్ ధరల గురించి ప్రశ్నించానని ఆమెకు చెప్పాను. అది విని ఆమె నాకు క్షమాపణలు చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు మేడమ్ చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించడంలేదని ఆమె అన్నారు' అని కదిర్ వివరించారు.













Click it and Unblock the Notifications