రామజన్మభూమిలో కొత్త వివాదం: బుద్ధుల కేంద్రంగా అయోధ్య: సాకేత్‌గా: బౌద్ధ సన్యాసులు ఎంట్రీ
లక్నో: కోట్లాదిమంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించలేదని, ఆయన నేపాలీయుడంటూ ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టినట్టే కనిపిస్తున్నాయి. సరికొత్త వివాదాన్ని రాజేసినట్టే ఉన్నాయి. కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలు బౌద్ధ సన్యాసులపై ప్రభావాన్ని చూపినట్టున్నాయి. నేపాల్ ప్రధానిమంత్రి చేసిన వ్యాఖ్యలు చేసిన రెండురోజుల్లోనే పలువురు బౌద్ధ సన్యాసులు రంగంలోకి దిగారు. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో ఆందోళనలను చేపట్టారు. ఆజాద్ బౌద్ధ ధర్మసేన ఈ ఆందోళనకు నాయకత్వాన్ని వహించింది.
Recommended Video
రామ జన్మభూమిలో యునెస్కో ద్వారా తవ్వకాలను చేపట్టాలంటూ నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అయోధ్య మెజిస్ట్రేట్ కార్యాలయం ముందు బైఠాయించారు. రామజన్మభూమి స్థలంలో ఇదివరకు నిర్వహించిన తవ్వకాల సందర్భంగా గౌతమ బుద్ధుడు, బౌద్ధిజానికి సంబంధించిన వస్తువులు వెలుగులోకి వచ్చాయని అన్నారు. తవ్వకాల సమయంలో రామజన్మభూమి స్థలంలో దొరికిన అన్ని రకాల వస్తువులను బహిర్గతం చేయాలని, వాటిని ప్రజలకు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రదేశంలో బౌద్ధిజానికి సంబంధవించిన అనేక వస్తువులు బయట పడ్డాయని, వాటిని దాచి ఉంచారని ఆరోపించారు.

యునెస్కో ద్వారా మాత్రమే రామజన్మభూమి స్థలంలో తవ్వకాలను చేపట్టాలని అన్నారు. రామజన్మభూమి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని బౌద్ధ సన్యాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అయోధ్య మెజిస్ట్రేట్‌కు వినతిపత్రాన్ని అందించారు. గౌతమ బుద్ధుడి కాలంలో అయోధ్యను సాకెత్‌గా పిలిచే వారని, బౌద్ధ సన్యాసులకు ఈ ప్రాంతం ఓ ప్రధాన కేంద్రంగా విరాజిల్లిందని వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, ఆనవాళ్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అలాగే యునెస్కో ద్వారా రామజన్మభూమిలో తవ్వకాలు జరిపించాలని, ఈ సందర్బంగా బౌద్ధ ఆనవాళ్లు మరిన్ని వెలుగులోకి వస్తాయని అన్నారు.
రామజన్మభూమిలో రామమందిరం నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ తాము రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డెకు వినతిపత్రాలను పంపించామని అన్నారు. ఫైజాబాద్ సిటీ మెజిస్ట్రేట్ ఎస్పీ సింగ్‌కూ వినపత్రాన్ని ఇచ్చారు. ఆయన హామీ మేరకు బౌద్ధ సన్యాసులు తమ ఆందోళనలను విరమించారు. శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించలేదని, ఆయన నేపాల్‌లో పుట్టారంటూ ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రకటన చేసిన వెంటనే బౌద్ధ సన్యాసులు రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications