బీజేపీ వ్యూహం: రామ మందిరం నుంచి రాజ్యాంగ సమీక్ష వరకు?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశ రాజకీయాలకు ఆయువు పట్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన తర్వాత అధికార బీజేపీ, సంఘ్ పరివార్ అనుబంధ సంఘాలు ఉత్సాహం ఉరకలేస్తోంది. 24 ఏళ్ల క్రితం బాబ్రీ మసీద్ ఉన్న స్థలంలో రాముడు జన్మించాడని చెప్తూ 1992 డిసెంబర్ ఆరో తేదీన బాబ్రీ మసీదును కూల్చిచేసిన సంఘ్ పరివారం తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయం.. హిందూత్వ వాది యోగి ఆదిత్యనాథ్ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన 28 గంటల్లోనే రామ మందిర నినాదం ఊపందుకున్నది.

దేశ చరిత్రలో తొలిసారి రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా రామ మందిర నిర్మాణానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహార్ చేసిన వ్యాఖ్య అసాధారణం కానున్నది.
సమయోచితంగా సమస్య పరిష్కరించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ ముద్ర

రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ ముద్ర

ఇది ఇంతటితో ఆగిపోయే సంకేతాలు కనిపించడం లేదు. త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) సొంత బలంపై తమ అనుకూల నాయకుడ్ని ఎన్నుకునేందుకు దాదాపు మార్గం సుగమమైనట్లే. అదే జరిగితే భారత రాజ్యాంగ స్వరూపం మారిపోయేందుకు బాటలు పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం.. రాజ్యాంగ సమీక్ష కోసం కమిషన్ ఏర్పాటు చేయగలిగారు. గానీ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు నాటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ నిరాకరించారు.

రాజ్యాంగ సమీక్షకు మార్గం

రాజ్యాంగ సమీక్షకు మార్గం

కానీ ప్రస్తుతం బీజేపీ అనుకూల వ్యక్తి.. దాదాపుగా అంతా బావిస్తన్నట్లు ఎల్ కే అద్వానీ.. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వారసుడిగా ఎన్నికవ్వడం ఖాయమని తెలుస్తున్నది. రాష్ట్రపతిగా అనుకూల వ్యక్తిగా నియామకమైతే మోదీ సర్కార్ తలచుకున్నదే తడవుగా ఇష్టారాజ్యంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం మారిపోవడం చాలా తేలిక అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వివాదాస్పద బాబ్రీ మసీదు - రామ మందిరం అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయాన్ని ఇందులో మమేకమైన పార్టీలు తిరస్కరించాయి. అందులో రామ్ లాలాకు చెందిన న్యాయవాది రంజనా అగ్నిహోత్రి కూడా తిరస్కరించడం గమనార్హం.

చర్చలతో పరిష్కారం అసాధ్యం

చర్చలతో పరిష్కారం అసాధ్యం

చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి తలెత్తదని రంజనా అగ్నిహోత్రి చెప్పారు. కేవలం ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు గతంలో మూడు పక్షాల మధ్య మూడోవంతు భూమి పంపిణీ మార్గానికే తాము అంగీకరించలేదని, అటువంటప్పుడు చర్చలు, సంప్రదింపులకు తామెందుకు అంగీకరిస్తామని ప్రశ్నించారు. అలహాబాద్ హైకోర్టు జస్టిస్ గా డీవీ శర్మ ఇచ్చిన మైనారిటీ తీర్పు ప్రకారం రాముడ్ని కాదని మరో పక్షానికి భూమి కేటాయించరాదని పేర్కొనడం గమనార్హం. ‘మనం కొన్నేళ్లుగా వివాద పరిష్కారం కోసం ఎదురు చూశాం. కానీ తీర్పు వెలువడేందుకు రంగం సిద్దమైంది. ఒకవేళ న్యాయస్థానం తీర్పు చెప్పలేకపోతే జల్లికట్టు ఉద్యమం సమయంలో మాదిరిగా ఆర్డినెన్స్జ్ జారీ చేయడం ద్వారా రామ మందిర నిర్మాణమే పరిష్కార మార్గం. 50 - 50 శాతం కేటాయింపునకు చర్చలు మార్గం కాదు' అని పేర్కొన్నారు.

స్వామిది కేవలం ఇంప్లీడ్ పిటిషన్ మాత్రమే

స్వామిది కేవలం ఇంప్లీడ్ పిటిషన్ మాత్రమే

సుబ్రమణ్య స్వామి పిటిషన్‌కు ఇందులో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఆయన ఇందులో వాది, ప్రతివాది కానీ కాదన్నారు. దీనిపై హైకోర్టు తిరస్కరించిన తర్వాత తనను ఇంప్లీడ్ చేసుకోవాలని మాత్రమే సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను 2011లో జస్టిస్ అఫ్తాబ్ ఆలం విచారిస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లాల్లాలకు మూడో వంతు భూమి చొప్పున కేటాయించాల్సి ఉంటుంది.

గతంలోనూ విఫలమైన మధ్యవర్తిత్వం

గతంలోనూ విఫలమైన మధ్యవర్తిత్వం

బాబ్రీ మసీద్ కమిటీ సంయుక్త కన్వీనర్ సయ్యద్ ఖాసిం ఇలియాస్ స్పందిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ ప్రతిపాదన ఏమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. మధ్యవర్తిత్వం, సంప్రదింపులకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చేశారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ), బాబ్రీ మసీద్ కమిటీ మధ్య చర్చలు ఎటువంటి ఫలితాన్నివ్వలేదు. పలు దఫాలుగా చర్చలు, సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఎప్పుడు చర్చల్లో పాల్గొన్నా ఆ భూమి తమదేనని వీహెచ్పీ వాదిస్తున్నదని, ఈ పరిస్థితుల్లో జస్టిస్ ఖెహర్ ప్రతిపాదనను ఆమోదించలేమని స్ఫష్టం చేశారు. ఈ సమస్య చట్టబద్ధంగా పరిష్కారం కావాలే తప్ప భావోద్వేగాల ప్రాతిపదికన కాదన్నారు.

సీజేఐ ప్రతిపాదన సమస్య పరిష్కారానికి...

సీజేఐ ప్రతిపాదన సమస్య పరిష్కారానికి...

ఈ కేసులో వాదిగా ఉన్న హసీం అన్సారీ కొడుకు ఇక్బాల్ అన్సారీ స్పందిస్తూ సుదీర్ఘ కాలంగా సాగుతున్న వివాదానికి తెర దించేందుకు చర్చలు సాయ పడతాయన్నారు. తాము చర్చలకు వ్యతిరేకం కాదని, ప్రతిరోజూ వాద ప్రతివాదనలు జరిగితే పరిష్కార మార్గం ఏర్పడుతుందని బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫార్యాబ్ జిలానీ తెలిపారు. అయితే గతంలోనూ సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయని, కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షించేందుకు సిద్ధమైనా చట్టబద్ధత కావాల్సి ఉంటుందన్నారు.

మరో రామ మందిర ఉద్యమం

మరో రామ మందిర ఉద్యమం

మరోసారి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమిస్తామని వీహెచ్పీ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 16 వరకు రామ మహోత్సవ్ నిర్వహిస్తామని వీహెచ్పీ తెలిపింది. ఈ నెల 28న భారతీయ హిందూ సంవత్సరం ప్రారంభం అవుతుందని, దానికి రెండు రోజుల ముందు నుంచి రామ మహోత్సవ్ పేరుతో ప్రజలను చైతన్య పరుస్తామని వీహెచ్పీ వెస్ట్రన్ జోన్ అధ్యక్షుడు ఈశ్వరీ ప్రసాద్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించడంతోపాటు 2 లక్షల మందికి చేరువవుతామని తెలిపారు. ఇందులో ఉత్తరప్రదేశ్ వాసులే 70 వేల మంది ఉంటారన్నారు. ప్రతి ఇంటిపైనా కాషాయ జెండా రెపరెపలు కనిపించాల్సిందేనని ఈశ్వరీ ప్రసాద్ చెప్పారు.

స్వాగతించిన ఉమా

స్వాగతించిన ఉమా

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను కేంద్ర మంత్రి ఉమా భారతి స్వాగతించారు. రాముడు అక్కడే జన్మించారని, అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం మూడు పక్షాలకు ఈ భూమి కేటాయించడం కుదరన్నారు. కోర్టు బయట పరిష్కారానికి మార్గం ఏర్పడితే.. సోమనాథ్ దేవాలయానికి బాటలు పడతాయన్నారు. ఇది ఎప్పుడు పూర్తవుతుందని చెప్పలేమని, కానీ ఏ సమయంలోనైనా రామ మందిర నిర్మాణం ప్రారంభం కావచ్చునన్నారు. ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసాబోలే స్పందిస్తూ తమ ధర్మ సంసద్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

సుప్రీంకోర్టు జోక్యం అనవసరం

సుప్రీంకోర్టు జోక్యం అనవసరం

ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా న్యాయస్థాం బయట అయోధ్య వివాదం పరిష్కారం అసాధ్యమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బ్రుందాకారత్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి హిందూత్వ శక్తులు బహిరంగంగా తమ హిందూత్వ ఎజెండాను ముందుకు తెస్తున్నప్పుడు ఈ సమస్య పరిష్కారం అసాధ్యమన్నారు. ఎటువంటి సందర్భాల్లో సీజేఐ ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చారో తెలియదని, కానీ వివాదాస్పదమైన అంశంలో సుప్రీంకోర్టు జోక్యం అనవసరం అని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a judicial first of the country, Chief Justice of India J S Khehar has offered to mediate out of court and settle the Ram Janmabhoomi - Babri Masjid dispute which has been dragging on for almost 24 years.
Please Wait while comments are loading...