అయోధ్య ఆలయానికి అలీగఢ్ కానుక

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.

ప్రాణ ప్రతిష్ఠ కోసం సిద్ధమౌతున్న అయోధ్య ఆలయానికి దేశ, విదేశాల నుంచి అనేక బహుమతులు అందుతున్నాయి. సీతమ్మ తల్లి జన్మించిన జనక్‌పురి నుంచి నేపాల్ ప్రభుత్వం వెండి విల్లంబులను పంపించింది. తమ దేశ ప్రత్యేకతగా చెప్పుకొనే కొన్ని రకాల స్వీట్లను కానుకగా అందజేసింది.

Ayodhya Ram Mandir: Lock weighing around 400 kg arrives

గుజరాత్‌కు చెందిన కొందరు వ్యాపారస్తులు 108 అడుగుల అగరబత్తీని అయోధ్యకు పంపించారు. 21 రోజుల పాటు ఏకధాటిగా మండుతుంది ఈ అగరబత్తీ. ఈ నెల 16వ తేదీన దీన్ని వెలిగించారు అయోధ్యవాసులు. 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకూ సువాసనలను పంచగలుగుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఏకంగా లక్ష లడ్డూ ప్రసాదాలను అందజేయనుంది. ఈ లడ్డూలన్నింటినీ ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలించారు టీటీడీ అధికారులు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు. ప్రతి ఒక్కరికీ రెండు లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిస్తుంది. మొత్తంగా 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు.

తాజాగా- హిందూ మహాసభ అయోధ్యా ఆలయానికి భారీ తాళాన్ని బహుమతిగా పంపించింది. దీని బరువు 400 కేజీలు. దీన్ని లారీలోకి ఎక్కించడానికి రెండు భారీ క్రేన్లను వినియోగించాల్సి వచ్చింది. ఈ ఉదయం తాళం- తాళం చెవిఈ ఉదయం అయోధ్యకు చేరాయి. హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతి దీన్ని తయారు చేయించారు.

Ayodhya Ram Mandir: Lock weighing around 400 kg arrives

అలీగఢ్‌‌కు చెందిన సత్యప్రకాష్ శర్మ, రుక్మణి శర్మ దీన్ని తయారు చేశారు. సత్యప్రకాష్ శర్మ ఇటీవలే మరణించారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ తాళాన్ని పంపించాలనేది ఆయన చివరి కోరిక. ఆయన కోరికను నెరవేర్చడానికి హిందూ మహాసభ ముందుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+