రాహుల్ గాంధీకి ఆలయ ప్రవేశం నిషిద్ధం: వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆదేశం: రోడ్డుపై బైఠాయింపు

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.

ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.

Ayodhya Ram Mandir: Rahul Gandhi takes dig at PM Modi

మరోవంక- అస్సాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాం చేరిన సందర్భంగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. అస్సాంలోని నాగౌన్‌లో గల ప్రాచీన భతద్రవ థాన్ ఆలయాన్ని సందర్శించడానికి రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వలేదక్కడి పోలీసులు, అధికారులు.

ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ రెండు రోజుల కిందటే అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటివరకు కూడా అనుమతులు లభించలేదు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే అనుమతి ఉంటుందనీ తెలిపారు.

ఆలయాన్ని సందర్శించాలనే ఉద్దేశంతో నాగౌన్‌కు చేరిన రాహుల్ గాంధీ, ఇతర నేతలకు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ రోడ్డుబై బైఠాయించారు. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శులు జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, ఇతర నాయకులు ఆయనతో పాటు రోడ్డుపై కూర్చున్నారు.

Ayodhya Ram Mandir: Rahul Gandhi takes dig at PM Modi

దీనితో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాను ఆలయాన్ని సందర్శించి తీరుతానని, చూడకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదంటూ రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ఆలయాన్ని సందర్శించడంలో తప్పేంటని పోలీసులను నిలదీశారు. నేడు ఒక్క వ్యక్తి (ప్రధాని మోదీ) మాత్రమే ఆలయాన్ని సందర్శించాలా? అంటూ ప్రశ్నించారు.

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తరువాతే భతద్రవ థాన్ ఆలయాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ తమకు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తాము పాటిస్తోన్నామని స్పష్టం చేశారు. దీనికి వారు వినిపించుకోలేదు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+