Ayodhya ram mandir: తిరుమలలో వేదవిద్యార్థుల రామాయణ పారాయణం; నగర సంకీర్తనలతో భక్తిపారవశ్యం!!

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రాణ ప్రతిష్ట అత్యంత అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ మేరకు ప్రముఖులందరూ అయోధ్య నగరానికి చేరుకుని ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొంటున్నారు. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శ్రీరాముడు అయోధ్య నగరానికి వేం చేసిన శుభ తరుణంలో జరగనున్న అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరిలోనూ ఉత్సుకతను కలిగిస్తోంది.

ఇక అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా సంపూర్ణ రామాయణ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయోధ్యలో నేడు రామాలయంలో బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వేద విద్యార్థులతో రామాయణ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీటీడీ తెలిపింది.

Ayodhya ram mandir: Ramayan parayana by Vedic students; and nagara sankeerthanas at Tirumala!!

ప్రస్తుతం రామాయణ పారాయణతో తిరుమల గిరులు మారుమోగి పోతున్నాయి. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని, అయోధ్యలో కొనసాగుతున్న హడావిడిని టిటిడి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్విబిసి తెలుగు ఛానల్లో స్వామివారి కల్యాణోత్సవం అనంతరం 12 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు.

ఇదిలా ఉంటే అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పూర్తి కావడంతో తిరుపతిలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. నగరంలోని కోలా వీధిలో ఉన్న శ్రీరాముని ఆలయంలో సుదర్శన హోమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు సుదర్శన హోమం లో పాల్గొన్నారు. 500 ఏళ్ళనాటి కల నిజమైందని.. శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన చేయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తిరుపతి వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పండుగ వాతావరణంలో పూర్తి కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో 500 మంది కళాకారులు ర్యాలీ నిర్వహించారు. టీటీడీ పరిపాలన భవనం నుంచి అన్నమాచార్య కళామందిరం వరకు జరిగిన ప్రదర్సనలో జైశ్రీరామ్ అంటూ భజన బృందాలు నామస్మరణలు చేశారు.

శ్రీరాముని విగ్రహాలతో భజన బృందాలు ప్రదర్సన నిర్వహించాయి. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరగడం ఎంతో గర్వంగా ఉందని.. కోట్లాదిమంది హిందువులకు ఈరోజు పెద్ద పండుగని భజన బృందాలు పేర్కొన్నాయి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీరాముని సంకీర్తనలను నిరంతరాయంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+