ఆర్ఎఎస్ నేతలు స్వలింగ సంపర్కులు: ఆజం ఖాన్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆజం ఖాన్ మరో వివాదానికి తెర తీశారు. ఆర్ఎస్ఎస్ నేతలు స్వలింగ సంపర్కులని, అందుకే పెళ్లి చేసుకోరని ఆయన వ్యాఖ్యానించారు. గేలపై సుప్రీంకోర్టు తీర్పును తిరిగి సమీక్షించాలని కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి చేసిన సూచన నేపథ్యంలో ఆజంఖాన్ ఆ వ్యాఖ్యలు చేశారు.

ఆజంఖాన్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్, విహెచ్‌పీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆజం ఖాన్ మానసిక స్థితి సరిగా లేదని వారు వ్యాఖ్యానించారు. గే సెక్స్‌ను నిషేధిస్తూ సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన తీర్పు సరిగా లేదని, దాన్ని తిరిగి సమీక్షించాలని అరుణ్ జైట్లీ శనివారంనాడు అన్నారు.
స్వలింగ సంపర్కంపై ఆజం ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నయీ దునియాలో వచ్చాయి. పలు అంశాలపై వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఆజం ఖాన్‌కు ఉంది.












Click it and Unblock the Notifications