15న బంద్: బాబు ప్రభుత్వం డిస్మిస్‌కు డిమాండ్, హెరిటేజ్‌పై బాంబు
చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీన తమిళ హక్కుల సంస్థ ఒకటి బంద్‌కు పిలుపునిచ్చింది. తమిళ కూలీలను ఎదురుకాల్పుల్లో చంపినందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. సదరు తమిళ సంస్థకు చెందిన ఓ కార్యకర్త మాట్లాడుతూ.. కూలీలు తమ పైన రాళ్లు, ఆయుధాలతో దాడి చేసినందు వల్లే కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్న మాట అంగీకరించేదిగా లేదన్నారు.
ఎన్‌కౌంటర్ చేయాల్సిందిగా ఆదేశించిన అధికారుల పైన కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బందులో అందరు పాల్గొనాలని ఆయన కోరారు.

కాగా, వారం రోజుల క్రితం గత మంగళవారం ఉదయం శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్ జరగగా, 20 మంది తమిళవాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీని పైన వారం రోజులుగా తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం నాడు చెన్నై శివార్లలోని ఆయనావరంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ స్టోర్స్ పైన నాటుబాంబు విసిరారు. అయితే, ఎలాంటిప్రమాదం సంభవించలేదు. పోలీసులు దీనికి సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications