బంగార్రాజుతో కళ్యాణ్ జ్యువెలర్స్.. నాగ్ ధరించిన నవరత్నహారం, పులిగోరు హారం కలెక్షన్ రిలీజ్
హైదరాబాదు: కళ్యాణ్ జ్యువెలర్స్... నగల విభాగంలో భారత దేశంలోనే అత్యంత నమ్మదగిన బ్రాండ్. అలాంటి ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌తో జతకట్టింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు నటించిన బంగార్రాజు చిత్రంతో కూడా జతకట్టింది. ఈ క్రమంలోనే పురుషుల కలెక్షన్‌ను విడుదల చేయనుంది. ఈ చిత్రంలో నాగార్జున నాగచైతన్యలు ధరించిన పొడువైన నవరత్న హారం, మరియు పులిగోరు హారంలను కళ్యాణ్ జ్యువెలర్స్ విడుదల చేయనుంది.
తెలుగు సినిమాను తన నటనతో ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు దిగ్గజ నటులలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిగత కలెక్షన్ నుంచి ప్రేరణ పొంది... ఈ రోజు పులిగోరు హారం, నవరత్న హారంలను అక్కినేని అభిమానులకు అందిస్తున్నామని కళ్యాణ్ జ్యువెలర్స్ పేర్కొంది. బంగార్రాజు క్యారెక్టర్‌లో నాగార్జున ఒదిగిపోయారు.ఈ చిత్రంలో ఆయన పంచకట్టు, ధరించిన పులిగోరు, నవరత్న హారం ఒకప్పటి నాగేశ్వరరావును గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. పులిగోరు ధరిస్తే మనిషి యొక్క ఠీవిని, దర్పాన్ని తెలుపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పులిగోరు ధరించడం సంస్కృతిలో భాగమవడంతో పాటు ఆనవాయితీగా వస్తోంది. ఇక నవరత్న హారంలో ఉన్న తొమ్మిది రత్నాలు పవిత్రత, మానవత్వం, మేల్కొలుపు, సంతృప్తి, ధైర్యం, ప్రేమ, జ్ఞానం, దయాగుణం, ఆరోగ్యంను ప్రతిబింబిస్తాయి. ఇవన్నీ అక్కినేని కుటుంబంలో కనిపిస్తాయి కాబట్టే వారి అభిమానులు కూడా ఈ హారాలను ధరించాలన్న ఉద్దేశంతో కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రత్యేకంగా పరిచయం చేస్తోంది.

కళ్యాణ్ జ్యువెలర్స్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ జతకట్టడంపై ఆ బ్రాండ్ అంబాసిడర్, బంగార్రాజులో ప్రధాన పాత్ర పోషించిన అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - " నా తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నాకు స్ఫూర్తి. ఈ సంప్రదాయపరమైన వేషధారణలో నేను బంగార్రాజు చిత్రంలో కనిపించి నాన్నకు అంకితం ఇస్తున్నాను. ఇక బంగార్రాజు చిత్రంలో నేను ధరించిన జ్యువెలరీ ఒరిజినల్‌గా నా తండ్రివే. సినిమా విడుదలకు ముందు నాన్నగారి లుక్‌లో కనిపించడంతో అభిమానులకు చాలా నచ్చేశాను. ఈ క్రమంలోనే కళ్యాణ్ జ్యువెలర్స్ తమతో జట్టు కట్టేందుకు ముందుకు వచ్చింది. నాన్నగారి హారం డిజైన్లను రిక్రియేట్ చేసేందుకు నిర్ణయించుకుంది."
https://www.youtube.com/watch?v=AF4j7c2z_sM
ఇక ఈ హారం ప్రకటన గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ - "నాగేశ్వరరావు ఒకప్పుడు ధరించిన ఈ ఐకానిక్ జ్యువెలరీని తిరిగి రీక్రియేట్ చేసి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ఒక బ్రాండ్‌గా మేము గ్రామీణప్రాంతాల్లో ధరించే ఉత్పత్తులపై కూడా దృష్టి సారించి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నాం.మా కస్టమర్లు ఇలాంటి ఐకానిక్ జ్యువెలరీని ధరించి ఇలాంటి సంప్రదాయంపై మరింత గౌరవం తీసుకురావాలని కోరుతున్నాం. ఇక ఈ జ్యువెలరీఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. స్టయిల్‌కు బ్రాండ్ కింగ్ నాగార్జున. ఇక ఆయన ధరిస్తే అది మరో లెవెల్‌కు వెళుతుంది. కస్టమర్లకు ఈ సంక్రాంతి కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుంది "
మకర సంక్రాంతి సందర్భంగా ఈ బంగార్రాజు జ్యువెలరీ ఇటు దేశవ్యాప్తంగా అటు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ ఔట్‌లెట్స్‌లో ముందస్తుగా ఆర్డర్ ఇవ్వొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బంగార్రాజు చిత్రం 14 జనవరి 2022న విడుదల కానుంది. ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=AF4j7c2z_sM&ab_channel=ZeeStudios












Click it and Unblock the Notifications