వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన ఉద్యోగులు

|
Google Oneindia TeluguNews

బ్యాంకుల విలీన ప్రక్రియ ఉద్యోగుల్లో ఆందోళనను కల్గిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ బ్యాంకుల విలీనం పై చేసిన ప్రకటన నేపథ్యంలోనే విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు శనివారం దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియోషన్ సభ్యులు ప్రకటించారు. ప్రభుత్వం చేపట్టిన విలీన ప్రక్రియపై యూనియన్ సభ్యులు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈనేపథ్యంలోనే భారతదేశానికి కావాల్సింది మెగా బ్యాంకులు, మెగా విలీనాలు అక్కర్లేదని ఉద్యోగులు చెప్పారు. భారత దేశం విశాలమైన దేశమని, లక్షలాది మంది ప్రజల, గ్రామాలకు ఇప్పటికి బ్యాంకు సౌకర్యం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రకటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా శనివారం ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. కేంద్రం వెనక్కి తగ్గేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.

bank employees hold a nationwide protest against the merger process of banks on Saturday.

కాగా బ్యాంకుల విలీనం పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూన్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఉన్న 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని, నేటీ ప్రకటనతో దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఆమె తెలిపారు.

English summary
All India Bank Employees Association members announced that bank employees would hold a nationwide protest against the merger process of banks on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X