వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్: రాబోయే 8 రోజుల్లో నాలుగు రోజులు బ్యాంకులు బంద్, మొత్తంగా 11 రోజులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మార్చి నెలలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు వస్తుండటం వినియోగదారులు గమనించాల్సిన విషయం. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వ తేదీ నుంచి రెండు రోజులపాటు సమ్మెకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో మార్చి 13 నుంచి వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకులు మూసివేయనున్నారు.

మార్చి 13వ తేదీ రెండవ శనివారం కాగా, మార్చి 14వ తేదీ ఆదివారం సెలవు. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు మూసివేయనున్నారు. దీంతో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ వరుసగా వరుసగా 4 రోజులు బ్యాంకులు పనిచేయవు.

banks are going to be closed for 4 days in the next 8 days here full details

కాగా, పండగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండవ శనివారాలు, 4 ఆదివారాలతో కలిపి మొత్తంగా మార్చి నెలలో 11 రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. స్థానిక సెలవులతో కలిసి 11 రోజులు పనిచేయనందున ఖాతాదారులు ముందస్తుగా తమ కార్యకలాపాలను చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

మార్చి 11న మహాశివరాత్రి సెలవు దినం ప్రకటించారు. మార్చి 22న బీహార్ దివస్, మార్చి 30న హోలీ పండగ సెలువులున్నాయి. 11 రోజులపాటు బ్యాంకులు పనియని కారణంగా బ్యాంకు వినియోగదారులు పని దినాల్లోనే తమ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

English summary
banks are going to be closed for 4 days in the next 8 days here full details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X