నోట్లు రద్దుతో ఎమర్జెన్సీ ! రంగంలోకి పారామిలటరీ
న్యూఢిల్లీ: రూ. 500. రూ.1,000 నోట్లు రద్దు కావడంతో మూతపడిన బ్యాంకులు నేడు (గురువారం) మళ్లీ తెరుచుకున్నాయి. అయితే పాత నోట్లు ఇచ్చేసి కొత్త నోట్లు తీసుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల దగ్గరకు రావడంతో పరిస్థితి అదుపుతప్పి సమస్యలు ఎదురౌతున్నాయి.
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపాలని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతాలకు పారామిలటరీ బలగాలను పంపించడానికి సిద్దం అయ్యింది.

దేశ రాజధానిలో పారామిలటరీ బలగాలు, క్విక్ ఆక్షన్ టీమ్స్, ఢిల్లీ పోలీసులు మోహరించారు. 1,200 పారామిలటరీ సిబ్బంది, 2,200 మంది డీల్లీ పోలీసులు, మరో 1,000 మందిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసర చర్యల కోసం కేటాయించింది.
ఎక్కడైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఎదురైయితో ఈ సిబ్బందిని అక్కడికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్లాక్ మనీని నిర్మూలించడానికి రూ. 500, రూ.1,000 నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు ఇస్తున్న సమయంలో గురువారం బ్యాంకుల దగ్గరకు ప్రజలు పరుగులు తీస్తున్నారు.












Click it and Unblock the Notifications