ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అయినప్పటికీ బుజ్జగింపు రాజకీయాల కోసం ముస్లింల రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతిస్తోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హావేరి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలైన రిజర్వేషన్లకు మేము మద్దతు ఇస్తామని, మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
గదగ్‌లో విలేకరులతో మాట్లాడిన బసవరాజ్ బోమ్మయ్ వెనుకబడిన తరగతుల కమిషన్‌లో మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం కెదరదని అభ్యంతరాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ముస్లింలలో చప్పరబండ్, నదాఫ్, పింజర్ సహా 24 కులాలు చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. వీరికి ఇప్పటికే 2ఏలో రిజర్వేషన్ ఉందని, దానికి అదనంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు పంచుతామని చెప్పినట్లు రిజర్వేషన్లు పంచుతామని చెబితే కుదరదని, అలా అడగడం చాలా బావుంటుందని బదులిచ్చారు. ఎన్నికల సమయంలో సమాజంలో గందరగోళం సృష్టించవద్దు అని, కాంగ్రెస్ విధానం స్పష్టంగా ఉంటే ఆ విషయం అంతే స్పష్టంగా చెప్పాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం వంటి ఆస్తి హక్కు కూడా ఉందని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా మాట్లాడకూడదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. బెంగళూరుకు నీళ్లు రాలేదని, హుబ్బళి కాలేజీ యువతి నేహా హత్య కేసును పట్టించుకోవడం మానేశారని, ఇలాంటి సమయంలో ముస్లీం రిజర్వేషన్ల విషయం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications