రేప్ కేసు, పోలీసులకు దేహశుద్ధి: 25 మందిపై కేసు

భువనేశ్వర్: పోలీసులపై స్థానికులు తిరుగుబాటు చేసి వెంటాడి చితకబాదారు. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చెయ్యకుండా నిందితుడిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారనే ఆగ్రహంతో ప్రజలు తిరగబడడంతో పోలీసులు వాహనం అక్కడే వదిలి కాలికి బుద్ది చెప్పిన సంఘటన ఒడిశాలో జరిగింది.

ఒడిశాలోని భువనేశ్వర్ జిల్లా లోని లక్ష్మీసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హల్దీపదా స్లమ్ ఏరియా ఉంది. ఇక్కడ సంతోష్ జెనా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నబాలిక మీద ఇతని కన్ను పడింది.

బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకుని అత్యాచారం చేశాడు. బాలిక గర్బవతి అయ్యింది. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో లక్ష్మీ సాగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చెయ్యలేదు.

beating up Cops in Odisha, Case against 25 Slum People

ఇక లాభం లేదని తెలుసుకున్న గ్రామస్తులు సంతోష్ జెనాను పట్టుకుని చెట్టుకు కట్టి చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంతోష్ ను రక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే గ్రామస్తులు అప్పటికే పోలీసుల మీద కోపంతో ఉన్నారు.

వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులకు చెప్పారు. పోలీసులు ముందుకు వెళ్లడంతో సబ్ ఇన్స్ పెక్టర్ అశోక్ హన్సాదాతో పాటు మిగిలిన పోలీసులను వెంటాడి దాడి చేసి చితకబాదారు. పోలీసులు జీపు అక్కడే వదిలి కాలికి బుద్ది చెప్పారు. సీనియర్ పోలీసు అధికారులు 25 మంది స్థానికుల మీద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+