నోర్ముయ్: ఆగ్రహంతో, అరుస్తూ జర్నలిస్ట్ మీదకు వెళ్లిన రాధేమా

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: రాధేమా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆమెపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించిన జర్నలిస్ట్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నోర్ముయ్‌ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

తనను పదే పదే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని సంబల్‌లో జరిగిన కల్కి మహోత్సవ్‌ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Behave yourself, shut your mouth, Radhe Maa tells journalist

ఆమెపై వచ్చిన ఆరోపణలను ఓ జర్నలిస్ట్ ప్రస్తావించడం ఆమె ఆగ్రహానికి కారణమైంది. తనపై ఎలాంటి ఆరోపణలు లేవని, అయినా పదే పదే అలాంటి ప్రశ్నలను ఎందుకు అడుగుతారంటూ కూర్చున్న ఆమె ఒక్కసారిగా అరుస్తూ పైకి లేచారు. అక్కడే ఉన్న అనుచరులు సర్దిచెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Controversial spiritual leader Radhe Maa lost her cool and broke down before the media here, alleging that she was being harassed unnecessarily.On a visit to the district to attend the ongoing 'Kalki Mahotsav', she took offence to a mediaperson asking her about certain charges levelled against her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి